పెదాలు పగిలితే ఏం చేయాలి ?-Effective Home Remedies For Dry And Cracked Lips 2 months

Effective Home Remedies For Dry And Cracked Lips Green Tea Bag Honey Rose Water Pack Lemon Juice Liquids Photo,Image,Pics-

అప్పుడే చలికాలం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట 20 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ చలికాలం మోసుకొచ్చే సమస్యల్లో ఓ ప్రాధానమైన సమస్య పెదాలు పగలడం. కొన్నిసార్లు ఈ సమస్య నొప్పిని తీసుకొస్తుంది. కొందరికి రక్తస్రావం కూడా జరుగుతుంది. కాని సాధారణంగా మాత్రం, పెదాల చుట్టూ చర్మం చచ్చిపోయినట్లు ఉండి, చూడడానికి అంతగా బాగుండదు. ఈ సమస్య ఇప్పటినుంచి మొదలు మరో మూడు నెలల వరకు మిమ్మల్ని వెంటాడవచ్చు. మరి ఈ సమస్యకు చికిత్స ఇంట్లో లేదా అంటే ఉంది, కేవలం లిప్ బామ్స్ మీద ఆధారపడటమే కాదు, సహజ వనరులతో కూడా పగిలిన పెదాలను సరిచేసుకోవచ్చు.

* ద్రవ పదార్థాలు తాగుతూ ఉండాలి. లిప్స్ డ్రై అవకుండా ఉండటానికి ఇదో మంచి మార్గం.

* తేనే, రోజ్ వాటర్ కలిపి ఓ మిశ్రమంలా తయారు చేసుకొని, పెదవులకి పట్టాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేసుకుంటే చాలు.

* స్వచ్చమైన తేనే దొరకాలే కాని, అసలు ఏ రకమైన లిప్ బామ్ కాని, కెమికల్ కాని అవసరం లేదు. సింపుల్ గా ఆర్గానిక్ తేనే పెదాలకి రాయండి సరిపోతుంది.

* నిమ్మరసం కూడా పగిలిన పెదాలకి పాతరూపం తీసుకువస్తుంది.

* కలబందకి నేచురల్ మాయిశ్చరైజర్ అనే పేరు ఉంది. కాబట్టి కలబందని అద్దుతూ ఉండండి.

* గ్రీన్ టీ బ్యాగ్, మిల్క్ క్రీమ్, కోకోనట్ ఆయిల్, కీరదోస కూడా మీ పగిలిన పెదాల్ని బాగుచేస్తాయి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...మొటిమలపై ఆరెంజ్ తో అస్త్రం సంధించండి

About This Post..పెదాలు పగిలితే ఏం చేయాలి ?

This Post provides detail information about పెదాలు పగిలితే ఏం చేయాలి ? was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Effective home remedies for dry and cracked lips, Honey and Rose water Pack, Liquids, Lemon Juice, aloe vera, green tea bag, Milk Cream

Tagged with:Effective home remedies for dry and cracked lips, Honey and Rose water Pack, Liquids, Lemon Juice, aloe vera, green tea bag, Milk CreamAloe vera,Effective home remedies for dry and cracked lips,green tea bag,Honey and Rose water Pack,Lemon Juice,Liquids,,