ఎముకల ఆరోగ్యం జాగ్రత్త .. ఈ ఆహారపు అలవాట్లు గమనించండి -Eating Habits That Put Your Bones In Danger 2 months

Bones Coffee Cool Drinks Dark Chocolates Eating Habits That Put Your In Danger Non-veg Photo,Image,Pics-

మన ఎత్తు, మన రంగు, మన ముఖకవళికలు మనచేతుల్లో ఉండకపోవచ్చు కాని, శరీర ఆరోగ్యం మాత్రం పూర్తిగా మనచేతుల్లోనే ఉంది. చర్మం, ఎముకలు, నరాలు, రక్తం .. ప్రతి భాగాన్ని మనమే రక్షించుకోవాలి. ప్రతి భాగాన్ని మనమే బలపరుచుకోవాలి. మనం పాటించే కొన్ని అలవాట్లు, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మన శరీరం లోపల మనకు తెలియని ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం చెడుగా ఉండకూడదు అంటే, సరైన లైఫ్ స్టయిల్ ఎంచుకోవాలి. ఓ వయసుకి వచ్చాక, ఎముకలు బలంగా ఉంటేనే, మనలో చేవ ఉంటుంది. కాబట్టి ఎముకల బలం కోసం ఈ క్రింది ఆహారపు అలవాట్ల గురించి ఆలోచించండి.

* అధికంగా మాసహారం, ముఖ్యంగా రెడ్ మీట్ తీసుకోవడం ఎముకలకి అంత మంచిది కాదు. అలాగే స్వీట్స్ కూడా ఎముకలకి చేటు చేస్తాయి.

* డార్క్ చాక్లెట్ లో ఎముకలకి పనికొచ్చే లక్షణాలే కాదు, ఎముకలని బలహీనపరిచే షుగర్స్, ఆక్సలేట్ కూడా ఉంటాయి. అందుకే, చాక్లెట్ ని కంట్రోల్ లో ఉంచండి.

* ఆల్కహాల్ అతిగా సేవిస్తే చేయని చేటు ఉంటుందా. లిమిట్ దాటితే ఇది కూడా ఎముకలకి శత్రువే.

* కాఫీ శరీరంలో కాల్షియం లెవెల్స్ ని తగ్గించవచ్చు. చెప్పనక్కరలేదు, కాల్షియం లేకపోతే ఎముకలు పనికిరాకుండా పోతాయి. కాబట్టి కాఫీ వ్యసనపరులు కొంచెం అదుపులో ఉంచండి మీ అలవాటుని.

* కొందరికి కూల్ డ్రింక్స్ పై మమకారం మరీ ఎక్కువ. ఇష్టమైన హీరో తాగుతున్నాడని మీరు అలవాటు చేసుకోకండి. ఆడేడ్ షుగర్స్ విపరీతంగా ఉంటాయి కూల్ డ్రింక్స్ లో.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...భోజనం తరువాత చేయకూడని పనులు ఏంటంటే

About This Post..ఎముకల ఆరోగ్యం జాగ్రత్త .. ఈ ఆహారపు అలవాట్లు గమనించండి

This Post provides detail information about ఎముకల ఆరోగ్యం జాగ్రత్త .. ఈ ఆహారపు అలవాట్లు గమనించండి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Eating habits that put your bones in danger, Bones, Non Veg, Dark Chocolates, Coffee, Alcohol, Cool Drinks

Tagged with:Eating habits that put your bones in danger, Bones, Non Veg, Dark Chocolates, Coffee, Alcohol, Cool Drinksalcohol,bones,coffee,cool drinks,Dark Chocolates,Eating habits that put your bones in danger,non-veg,,