మొబైల్ స్లో అవుతోందా? ఇవిగో తక్షణ పరిష్కార మార్గాలు

మార్కేట్లో 3GB RAM ఫోన్లు చాలానే వచ్చేసాయి.ర్యామ్ పెరిగినట్లే కాని ర్యామ్ తో పాటు జనాల అవసరాలు కూడా పెరుగుతున్నాయి.

 Easy Ways To Treat Your Slow Running Mobile-TeluguStop.com

ఆకర్షిణీయమైన యాప్స్ వస్తున్నాయి, దాంతో మొబైల్ లో యాప్స్ పెరుగుతున్నాయి.ఫోన్ స్లోగా పనిచేయడానికి ఇది కూడా ఓ కారణం.

కాని ఇదొక్కటే కారణం కాదు.ఇంకా ఉన్నాయి.

ఆ కారణాలేంటో, ఫోన్ తిరిగి వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

* అన్నిటికన్నా ముందు సమస్య ఏమిటో తెలుసుకోవాలి.

దానికోసం Trepn Profiler వాడండి.ఇది మీ మొబైల్ Central Processing System (CPU) మీద పడుతన్న భారం గురించి పూర్తి వివరాలు అందిస్తుంది.

CPU మీద RAM మీద ఒత్తిడి ఎలా పెరుగుతోంది? ఏ కారణంతో పెరుగుతుందో Trepn Profiler చాలా వివరంగా చూపిస్తుంది.సమస్య తెలిసాక పరిష్కారం తెలుసుకోవడం ఎంతసేపు!

* మొబైల్ విడ్జెట్స్ స్క్రీన్ మీద బాగానే ఉంటాయి కాని CPU మీద, RAM మీద ఒత్తిడి పెంచుతాయి.

మీ ఫోన్ ని ఎలాగో 99% మీరే చూసుకుంటారు.కాబట్టి అనవసరపు హంగు ఆర్భాటాలు ఎందుకు, ఆకర్షణీయమైన widgets ఎందుకు.ముఖ్యంగా థర్ట్ పార్టీ విడ్జెట్స్ జోలికి వెళ్ళొద్దు.

* Launchers ని వాడొద్దు.

స్టోర్ లో ఎన్నో లాంచర్స్ మీ మెమోరి స్పేస్ ని తినేయడమే కాకుండా, ఇన్బిల్ట్ యానిమేషన్స్, వాల్ పేపర్సద తో లేని ఒత్తిడి పెంచుతాయి.మొబైల్ తో వచ్చిన UI కన్నా స్పీడ్ గా, స్మూత్ గా ఏ లాంచర్ పనిచేయదు.

కాబట్టి మొబైల్ లో ఉన్న డీఫాల్ట్ UI నే వాడండి.ఇంకేది వద్దు.

* మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి.ఇదో బెస్ట్ మార్గం.

మొబైల్ స్విచ్ ఆఫ్ చేయగానే క్యాచి ఫైల్స్ చాలావరకు డిలిట్ అయిపోతాయి.ప్రాబ్లమ్ మరీ సీవియర్ గా ఉంటే మాత్రం రిస్టోర్ ఫ్యాక్టరీ సెటింగ్స్ నొక్కయటమే.

* క్యాచీ ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం, స్టోరేజి స్పేస్ తగ్గించుకోవడం, అనవసరపు యాప్స్ డిలీట్ చేయడం, సిస్టమ్ ఆనిమేషన్స్ తీసేయటం, బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయడం, ఒకే బ్రౌజర్ వాడటం .ఇవి ఎలాగో మీకు తెలిసిన సలహాలే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube