ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఎలా వాడాలి?

ఒకే ఫోన్ లో రెండు సిమ్ కార్డులు ఉంటాయి.కాని ఓక మొబైల్ లో ఆ రెండు నంబర్లకి వాట్సాప్ ఖాతా వాడటమే కష్టం అని అనుకోకండి.

 Easy Way To Use Two Whatsapp Accounts In One Mobile-TeluguStop.com

ఒకే మొబైల్ లో రెండు వాట్సాప్ ఖాతాలే కాదు, రెండేసి ఫేస్ బుక్ యాప్స్ , రెండేసి ట్విట్టర్ యాప్స్ .ఇలా ఏ యాప్ అయినా రెండు ఒకే మొబైల్ లో వాడుకోవచ్చు.దాన్నే పారలల్ స్పేస్ అని అంటారు.

ఈ పారలల్ స్పేస్ ని వాడటం రెండు రకాలుగా సాధ్యపడుతుంది.ఒకటి ఫోన్ లో ఇన్బిల్ట్ గా పారలల్ స్పేస్ ఉండటం, రెండూ పారలల్ యాప్స్ అందించే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం.

ఎలాంటి థార్డ్ పార్టీ యాప్ సహాయం లేకుండా పారలల్ స్పేస్ ని వాడటం XIAOMI MI ఫోన్స్ లో సాధ్యపడుతుంది.

మీరే గనుక షియోమి ఫోన్ వాడుతోంటే , అందులో MIUI-8 రన్ అవుతోంటే సెకన్లలో వాట్సాప్ రెండొవ ఖాతా తెరవొచ్చు.ఒకటి Settings లొకి వెళ్ళి System & Device సెట్టింగ్స్ లో ఉండే Second Space ని ఆన్ చేయడం ద్వారా.

ఇది ఆన్ చేయగానే మీ మొబైల్ లో సెకండ్ స్పేస్ వచ్చేస్తుంది.ఆ స్పేస్ లో మీరు అన్ని యాప్స్ ని రెండొవసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

స్పేస్ మొత్తాన్ని ప్రైవేట్ గా వాడుకోవచ్చు.అలా కాకుండా, దాని కిందే Device సెక్షన్ లో ఉండే Dual Apps లో మీకు ఇష్టం వచ్చిన యాప్ ని డూప్లికేట్ చేసుకోవచ్చు.

ఇక మీద దగ్గర షియోమి ఫోన్ లేకపోయినట్లయితే, స్టోర్ లో రెండేసి యాప్స్ అందించే యాప్స్ బాగానే దొరుకుతున్నాయి.అందులో Parallel Space అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోని ఇష్టమైన యాప్స్ ని డూప్లికేట్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube