గవర్నర్‌కు ఎంసెట్‌ తలనొప్పి

ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే.ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌లకు పెద్దగా పని ఉండదు.

 Eamcet Issue Gets Headache To Governor-TeluguStop.com

కాని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ అయిన నరసింహన్‌కు ఇరు రాష్ట్రాల సమస్యలతో, గొడవలతో పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతోంది.ఇప్పటికే పలు విషయాల్లో రెండు రాష్ట్రాలు కూడా విభేదిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.

ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఇరు రాష్ట్రాలు గవర్నర్‌ ముందుకు తీసుకు వెళ్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై గవర్నర్‌ సమక్షంలో పొట్లాడిన ఇరు రాష్ట్రాలు తాజాగా ఎంసెట్‌ నిర్వహణపై వివాదాన్ని సృష్టిస్తున్నాయి.

ఉమ్మడిగానే ఎంసెట్‌ నిర్వహించాలని ఆంధ్రప్రదేవ్‌ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాస్‌ డిమాండ్‌ చేస్తున్నాడు.కాని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి మాత్రం ఉమ్మడి ఎంసెట్‌ వీలు పడదని తేల్చి చెబుతున్నాడు.

అవసరమయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంసెట్‌ నిర్వహణలో సాయం చేస్తామని ప్రకటించాడు.ఈ ఇద్దరు మంత్రులు కూడా గవర్నర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ వివాదాన్ని ఎలా తేల్చాలి అనే విషయంపై గవర్నర్‌ నరసింహన్‌ తల పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ వివాదాన్ని గవర్నర్‌ ఎలా పరిష్కరిస్తాడు అనే విషయంపై ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube