మీ మొబైల్ ఫోన్ ని కంట్రోల్ చేసే టాటూ ఇది

మీ చేతికో టాటూ ఉండి, దానితో ఫోన్ కాల్ చేస్తే ఎట్లా ఉంటుంది.ఫేస్ బుక్, వాట్సాప్ నోటిఫికేషన్‌ అదే టాటూ ద్వారా చెక్ చేసుకుంటే ఏట్లా ఉంటుంది? ఇదేమైనా హ్యారి పాటర్ సినిమా కాదుగా చేతిమీద టాటూతో మనుషులని పిలవడానికి అనుకుంటున్నారా.అది మ్యాజిక్ అయితే, ఇప్పుడు లాజిక్ తో అలాంటి టాటూ ఒకటి డిజైన్ చేశారు మిచిగన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్.మైక్రొసాఫ్ట్ సహకారంతో జరిగిన ఈ ఆవిష్కరణలో స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేయగలిగే టాటు ఒకటి ప్రపంచానికి పరిచయం చేశారు.

 Duoskin – A Temporary Tattoo That Can Control Your Smartphone-TeluguStop.com

దీని పేరు డ్యుయోస్కిన్.

అయితే ఇది టచ్ పాడ్ కాదు, డిజిటల్ టాటూ లాంటిది.

మన శరీరంలో ఒక భాగం లానే ఉంటుంది .ఇది ఒక స్టయిల్ స్టెట్‌మెంట్ లాగా కనబడుతూనే, మన చర్మం ద్వారా మొబైల్ ఫోన్స్ ని ఆపరేట్ చేయడంతో పాటు, డైటా షేరింగ్ కి పనికివస్తుంది.ప్రస్తుతానికైతే దీనితో చర్మానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు అని అంటున్నారు కాని దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.

స్కిన్ మీద సాఫ్ట్ డిస్ప్లే కూడా అవుతుందట.

అలాగే మన బాడి టెంపరేచర్ ని బట్టి ఈ డ్యుయోస్కిన్ రంగులు కూడా మారుస్తుంది.ఈ టాటూ వైర్ లెస్ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త విప్లవం తీసుకురానుందని టెక్నాలజీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

దీని ధర 10 డాలర్లు నుంచి మొదలవుతుందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube