అనసూయ ఎక్కడికి పోయింది?

జబర్దస్త్ ప్రోగ్రాం ఊపులో, ప్రతి తెలుగింటికి తెలిసిపోయింది యాంకర్ అనసూయ.టీవి వరకే తనని తాను పరిమితం చేసుకోకుండా, పెద్ద స్క్రిన్ పై రెండుసార్లు మెరవడమే కాదు, ప్రేక్షకులని ఆకట్టుకుంది కూడా ఈ హాట్ యాంకర్.

 Dull Period For Anchor Anasuya-TeluguStop.com

సోగ్గాడే అనసూయ చలాకితనాన్ని, క్షణం అనసూయలో దాగున్న నటిని వెండితెరకు పరిచయం చేసాయి.

మంచి గుర్తింపు సాధించిన అనసూయకి వరుస అవకాశాలు వస్తాయనుకుంటే, అలాంటిదేమి జరగట్లేదు.

మధ్యమధ్యలో కొన్ని తగిలినా, అన్ని ఐటమ్ సాంగ్ అవకాశాలే అని వినికిడి.అందువల్లే, దేనికి పచ్చజెండా ఊపలేకపోయింది ఈ జబర్దస్త్ బ్యూటి.

పెద్ద బ్యానర్లో ఛాన్స్ వస్తే తప్ప సినిమా చేయనని, అలాగే గ్లామర్ పాత్రలు చేయనని గిరి గీసుకు కూర్చుంది అనసూయ.మరోవైపు తోటి యాంకర్ రష్మీ గ్లామర్ ని నమ్ముకోని మూడు నాలుగు ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుంది.

మరి తనని చూసైనా అనసూయ కాస్త పట్టింపు వదిలి గ్లామర్ వైపు అడుగులేస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube