తాగి చేయి చేసుకున్న అంజలి

హీరోయిన్‌ అంజలి మరోసారి వివాదాస్పదం అయ్యింది.ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది.

 Drunken Anjali Created Nuisance At Tabla Pub-TeluguStop.com

తాజాగా ఈమె హైదరాబాద్‌లోని తబల పబ్‌లో బాగా తాగి ఒక వ్యక్తిని కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది.శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన పోలీసుల వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అంజలితో ఆ వ్యక్తికి సారీ చెప్పించిన పోలీసులు కేసు వరకు పోకుండా ఇద్దరికి సముదాయించినట్లుగా అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది.

వివాదం వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని తబల పబ్‌లో అంజలి ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంది.

ఆ సమయంలోనే అంజలి బాగా తాగి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించింది.ఆ సమయంలో అంజలికి ఒక వ్యక్తి అడ్డు వచ్చాడు.

దాంతో ఆ వ్యక్తిని బాగా తిట్టడం ప్రారంభించిందట.దాంతో ఆ వ్యక్తి కూడా అంజలిపై ఆరోపణలు చేయడం ప్రారంభించాడట.

అతడి మాటలకు ఆగ్రహం ఆపుకోలేక పోయిన అంజలి చెంపపై ఒక్కటి పెట్టిందట.దాంతో ఆ వ్యక్తి సన్నిహితులు అంజలిపైకి వచ్చారట.

అదే సమయంలో అంజలి పక్కన ఉన్న వారు కూడా ముందుకు వచ్చారు.దాంతో పబ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.

వెంటనే పబ్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు వివాదం సర్దుమనిగేలా చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube