Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

డ్రగ్స్ కేసు : కన్నీళ్లు పెట్టుకున్న తనీష్ .. నిజాలు వెల్లడి -Drugs Case : Taneesh Into Tears Revealing Facts

టాలివుడ్ డ్రగ్స్ కేసులో మొదటి విడత విచారణ చివరి దశకు చేరుకుంది. ఈరోజు హీరో నందుని విచారించడంతో మొదటి విడత విచారణ పూర్తవుతుంది. ఇక నిన్న యువనటుడు తనీష్ ని విచారించారు సిట్ అధికారులు. ఉదయం పదిన్నరకు హాజరైన తనీష్, మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఎక్సైజ్ కార్యాలయాన్ని విడిచి వెళ్ళాడు. హీరో నవదీప్ తో తనీష్ కి మంచి స్నేహం ఉంది. డ్రగ్స్ సరఫరా గురించి నవదీప్ నిజాలు ఒప్పుకోవడంతో, ఆ టాపిక్ తోనే విచారణ మొదలుపెట్టినట్టు సమాచారం. నవదీప్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారా ? కెరీర్ సరిగా సాగట్లేదు కాబట్టి ఆ డిప్రెషన్ లో డ్రగ్స్ మొదలుపెట్టారా అంటూ ప్రశ్నలు మొదలుపెట్టారు సిట్ అధికారులు. దానికి సమాధానమిస్తూ, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. సిగరెట్, మద్యం అలవాటు ఉంది. కొన్నిసార్లు గంజాయి కూడా తీసుకున్నాను కాని డ్రగ్స్ ఎప్పుడు ముట్టలేదు అని తనీష్ చెప్పాడు.

మరి కెల్విన్, జీషన్ లతో సంబంధాలు ఎలా ఉన్నాయి ? వారి మొబైల్స్ లో మీ నంబర్ ఎందుకు ఉంది ? వారితో ఎందుకు మాట్లాడారు అంటూ సిట్ టీమ్ ఉక్కిరిబిక్కిరి చేయగా తనీష్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో కొందరు పెద్ద మనుషులు ఎన్నో చేస్తున్నారు, గుడ్ విల్ కోసం డ్రగ్స్ సరఫరా చేసేది వారే, నాలాంటి చిన్నవాళ్ళని వదిలేయండి, అసలే కెరీర్ బాగా లేక ఇబ్బందిపడుతున్న దశలో ఇలాంటివి జరగడం చాలా బాధగా ఉంది, నన్ను వదిలేయండి, నేను ఎదగాలి అంటూ తనీష్ బాగా ఏడ్చాడట. తనకు సినిమా వారి పార్టీలకి వెళ్ళే అలవాటు కాని, మామూలుగా పబ్బులకి వెళ్ళే ఆసక్తి కాని లేదని, స్నేహితులతో ఉన్నప్పుడు ఎలాగో తాగే సిగరెట్, మద్యంతో పాటు కొన్నిసార్లు గంజాయి తీసుకున్నాను, అంతే తప్ప, డ్రగ్స్ గురించి తనకు ఏమి తెలియదని తనీష్ మరోమారు చెప్పాడు.

ఈరోజు నందుని విచారించిన తరువాత, మొదటి విడత రిపోర్టుని తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తుంది సిట్ టీమ్. ఇక రెండోవ విడత విచారణ ఉంటుందా, ఉంటే సినిమా ఇండస్ట్రీ వారు ఎవరెవరు రావాల్సి ఉంటుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. అన్నట్లు, తనీష్ నుంచి ఎలాంటి సాంపిల్స్ తీసుకోలేదు. మరో వార్త ఏమిటంటే, డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నవారిపై చార్జి షీట్ ఫైల్ చేస్తామని మంత్రి నాయిని నరసింహారెడ్డి నిన్న మీడియాకి తెలిపారు.

Continue Reading
More Posts
To Top