డ్రగ్స్ కేసు : ఒక తప్పు ఒప్పుకున్న రవితేజ

డ్రగ్స్ కేసు విచారణలో నిన్న యాక్టర్ రవితేజ వంతు.ఉదయం పదిన్నరకు తెలంగాణ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న రవితేజ.

 Drugs Case – Raviteja Admits Attending Rave Parties-TeluguStop.com

ఆయన్ని సాయంత్రం 7:40 నిమిషాల దాకా విచారించారు.ఈక్రమంలో ఎన్నో ప్రశ్నలు సంధించారు.

వయసు పెరుగుతున్నా కొద్ది, ఎనర్జీ తగ్గకుండా, సెట్లో ఉత్సాహవంతంగా గడిపేందుకు, డ్యాన్సులు చేసేందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారా ? పూరి జగన్నాథ్ కి డ్రగ్స్ వాడే అలవాటు ఉంది, ఆయనతో చాలా కొల్జ్ రిలేషన్ మెయింటేన్ చేసే మీరు కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డారా ? మీ డ్రైవర్ డ్రగ్స్ కొంటున్నాడు, కెల్విన్ దగ్గరి నుంచి అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం ఉంది, ఆ డ్రగ్స్ మీ డ్రైవర్ నుంచి తీసుకునేది మీరేనా ? తరచుగా థాయిలాండ్ లో ఏం పని ? ఎందుకు వెళ్తుంటారు ? ఇలాంటి ప్రశ్నలెన్నో వేసారు సిట్ అధికారులు.అందులో కొన్నిటికి స్పష్టంగా జవాబిచ్చిన రవితేజ, కొన్నిటికి మాత్రం అటుఇటుగా సమాధానమిచ్చారట.

తనకు డ్రగ్స్ అలవాటు లేదని రవితేజ చెప్పారట.తన సొంత తమ్ముడు డ్రగ్స్ తీసుకునేవాడు, తన ముందే చాలామంది డ్రగ్స్ తీసుకుంటుండగా చూసాను కాని తానెప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడలేదని రవితేజ చెప్పారు.

ఐతే రేవ్ పార్టీలకు హాజరయ్యే అలవాటు ఉందట.తరచుగా థాయిలాండ్ వెళ్ళేది రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేయడానికే అని, అక్కడే కాదు, హైదరాబాద్ లో కూడా చాలాసార్లు రేవ్ పార్టీలకి వెళ్లాలని, అయితే ఆ పార్టీల్లో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నా, తానూ మాత్రం ఎప్పుడు ముట్టుకోలేదు అని రవితేజ చెప్పారట.

ఇక పూరి జగన్నాథ్ మీద స్పందిస్తూ, పూరి తో బలమైన ఫ్రెండ్ షిప్ ఉన్నా, ఎన్నో ఏళ్ళుగా సత్సంబంధాలు ఉన్నా, పూరి జీవితంలో డ్రగ్స్ గురించి తనకు తెలియదని రవితేజ అన్నట్లు సమాచారం.

ఇక తన డ్రైవర్ తో తానెప్పుడు డ్రగ్స్ తెప్పించుకోలేదని రవితేజ స్పష్టం చేసారట.

తమ్ముడికి డ్రగ్స్ అలవాటు ఉంది, అందుకే పక్కన పెట్టాను, చెబితే వినిపించుకోలేదు అంటూ రవితేజ ముక్కుసూటిగా చెప్పెసారట.ఇంతచెప్పిన తరువాత తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి రవితేజ నిరాకరించడం గమనార్హం.

ఇక కెల్విన్ తో కాని, జీషాన్ తో కాని తనకు ఎలాంటి పరిచయం లేదని రవితేజ అన్నారు.

ఈరోజు రవితేజ డ్రైవర్ ని విచారించనున్నారు సిట్ అధికారులు.

గత మూడు రోజులుగా విచారణలో కొత్త పేర్లు పెద్దగా బయటకి రాకపోవడంతో సిట్ టీం కొంత నిరుత్సాహానికి లోనైందట.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube