Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

డ్రగ్స్ కేసు : ఛార్మీ విచారణలోని విశేషాలు ఇవే -Drugs Case : Highlights Of Charmee’s Interrogation

సినీనటి ఛార్మీ నిన్న డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హైదారాబాద్ నాంపల్లి తెలంగాణ అబ్కారి ఆఫీసుకి ఉదయం 10 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆమె కోరిక మేరకు నలుగురు మహిళా ఆఫీసర్లు శ్రీల‌తలు, అనిత‌, జ‌య‌ల‌క్ష్మి మరియు రేణుక‌లు విచారించినట్లు సమాచారం. అయితే ఛార్మీ నుంచి సరైన సమాచారం రాబట్టుకోవడంలో మాత్రం వీరు విఫలమయినట్లు తెలుస్తోంది. అకున్ సబర్వాల్ లేని లోటు నిన్నటి విచారణలో స్పష్టంగా కనిపించిందట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో ఛార్మీ డ్రగ్ డీలర్ కెల్విన్ తో దిగిన ఫోటో ఒకటి అధికారులు చేజిక్కించుకున్నారు. ఆ ఫోటో ఎక్కడిది ? కెల్విన్ తో ఫోటో ఎందుకు దిగాల్సివచ్చింది ? ఆ సినిమా ఆడియో ఫంక్షన్ పూర్తయిన తరువాత పార్టీ చేసుకొని డ్రగ్స్ తీసుకున్నారా ? ఇలాంటి ప్రశ్నలకి ఛార్మీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదట. అలాగే కెల్విన్ – ఛార్మీకి మధ్య వాట్సాప్ లో వెయ్యికి పైగా మెసేజ్లు ఉన్నాయి. ఈ మెసేజ్లు ఎక్కడివి అని అడిగితె ఛార్మీ మౌనంగా కూర్చుందట.

Continue Reading
More Posts
To Top