భోజనం చేస్తుండగా నీళ్ళు తాగవచ్చా ?

ఈ అనుమానం మీకు ఇప్పటికి చాలాసార్లు వచ్చి ఉండాలే … ఈ టాపిక్ మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి.కొందరేమో భోజం చేస్తుండగా నీళ్ళు తాగకూడదు అని అంటారు, మరికొందరేమో నీళ్ళు తాగకపోతే గొంతులో ముద్ద కడుపు దాకా చేరేదెలా అని ప్రశ్నిస్తుంటారు.

 Drinking Water During A Meal Is Good For Digestion ?-TeluguStop.com

ఇక భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగాకూడదు అని వాదించేవారు గుడ్డిగా, తాగకూడదు అని చెబుతారు కాని, ఎందుకు తాగకూడదో చెప్పకపోవడం వలనే వారి వాదనను పక్కనపెట్టేస్తారు జనాలు.మరి భోజనం చేస్తుండగా నీళ్ళు తాగవచ్చా ? తాగకూడదా ? మీరేమనుకుంటున్నారు ?

మన కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తిన్న తిండిని బ్రేక్ డవున్ చేస్తుంది.దాంతో మన శరీరం పదార్థాలను జీర్ణం చేసుకుంటుంది.అంటే, ఈ ఆసిడ్ లేకపోతే మన జీర్ణక్రియ స్తంభించినట్టే.తినే సమయంలో నీళ్ళు తాగడం వలన ఈ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ డైలుట్ అవుతుందని, దాంతో జీర్ణక్రియ నేమ్మదిస్తుందని, తిన్న తిండి సరిగా బ్రేక్ డవున్ కాదని చాలామంది పరిశోధకులు చెబుతారు.కడుపు ఉబ్బటం కూడా తినే సమయంలో నీళ్ళు తాగడం వల్లే అని అంటారు.

మరోవైపు కొంతమంది డాక్టర్ల వాదన ఇందుకు భిన్నంగా ఉంది.కడుపులో సహజంగా ఉండే ఆసిడ్స్ తో పాటు నీళ్ళు కూడా ఆహారాన్ని బ్రేక్ డవున్ చేయడానికే ఉపయోగపడతాయి, కాబట్టి తినేటప్పుడు నీళ్ళు తాగడంలో తప్పు లేదు అని అంటున్నారు.

కాబట్టి ఈ విషయం మీద మెడికల్ ప్రపంచలోనే ఓకే కామన్ అభిప్రాయం లేదు.మరి మనలాంటి సామాన్యులు ఏం చేయాలి ? ఎంతైనా తింటున్నప్పుడు గొంతులో ఏదైనా తట్టుకోవడం రోజూ జరిగే పనే .కాబట్టి గ్లాసులో నీళ్ళు దగ్గర ఉండాల్సిందే.కాని అతిగా తాగొద్దు.

ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గ్లాస్ దగ్గరపెట్టుకోండి.భోజనానికి ఓ అరగంట ముందే నీళ్ళు తాగితే బెటర్ అని మరో వర్గం పరిశోధకులు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube