జ‌న‌సేన‌లోకి జంపింగ్‌లు స్టార్ట్‌!.. తొలి వికెట్ టీడీపీ నుంచే!

ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌లోకి జంపింగ్‌లు స్టార్ట‌యిపోయాయి.అది కూడా జ‌న‌సేనాని ఎంతో ఇష్ట‌ప‌డే చంద్ర‌బాబు టీంలోని మాజీ ఎమ్మెల్యేనే కావ‌డం గ‌మ‌నార్హం.

 Tdp Ex-mla To Join Jana Sena?-TeluguStop.com

తాజాగా ఈ విష‌యం ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర‌తీసింది.విష‌యంలోకి వెళ్తే.

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత అన్నా రాంబాబు ఇటీవ‌ల టీడీపీకి రాజీనామా చేశారు.అయితే, గిద్ద‌లూరులో యాక్టివ్‌గా ఉండే రాంబాబు ఒక్క‌సారిగా ఇలా పార్టీకి రాజీనామా చేయ‌డంపై అసలు ఏం జ‌రిగి ఉంటుంద‌నే విష‌యంపై అంద‌రి దృష్టీ ప‌డింది.

దీంతో ఇప్పుడు అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.అదేంటంటే.

త్వ‌ర‌లోనే రాంబాబు జ‌న‌సేన‌లోకి వెళ్తున్నాడ‌ని స‌మాచారం.అంతేకాకుండా రాంబాబుకు జ‌న‌సేనాని గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ హామీ ఇచ్చాడ‌ని తెలిసింది.

అందుకే అంత ధైర్యంగా టీడీపీ నుంచి రాంబాబు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని స‌మాచారం.ఇక‌, ఇక్క‌డే ఇంకో విష‌యం కూడా వెలుగులోకి వ‌చ్చింది.

ఇటీవ‌ల ఉద్దానం కిడ్నీ బాధితుల‌ను ఆదుకునే క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబుతో జ‌న‌సేనాని ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తిలో భేటీ అయ్యారు.ఈ సంద‌ర్భంగా ఓ పావు గంట పాటు ఇద్ద‌రూ ఏకాంతంగా చ‌ర్చించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ చ‌ర్చ‌ల్లోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుని ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లాల‌ని డిసైడ్ అయ్యార‌ని, అదేస‌మ‌యంలో సీట్ల పంప‌కాల పైన కూడా ఇద్ద‌రి మ‌ధ్య కేటాయింపులు జ‌రిగిపోయాయ‌ని స‌మాచారం.

దీనిని బ‌ట్టి ప్ర‌కాశం జిల్లాలో ఇప్పుడు టీడీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు పేట్రేగ‌డం, చంద్ర‌బాబు మాట‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం, మ‌రోప‌క్క వైసీపీ పుంజుకుంటుంద‌న్న వార్తల నేప‌థ్యంలో చంద్ర‌బాబు గిద్ద‌లూరు టికెట్‌ను జ‌న‌సేనానికి అప్ప‌గించేశార‌ట‌.

ఈ వార్త తెలిసిన రాంబాబు వెంట‌నే టీడీపీకి రాజీనామా చేశాడ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ గిద్ద‌లూరు టికెట్ జ‌న‌సేన‌కు వెళ్తోంది కాబట్టి తాను ఆ పార్టీలోకి జంప్ చేస్తే.తిరిగి ఆ టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని రాంబాబు మంచి ప్లాన్‌తోనే సైకిల్ దిగేశాడ‌ని అంటున్నారు స్థానిక త‌మ్ముళ్లు.

టికెట్ ద‌క్క‌ద‌నే ఫిరాయింపు!


టీడీపీలో తాను కొన‌సాగితే.వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌ని అన్నా రాంబాబుకు భ‌యం ప‌ట్టుకుంద‌ట‌.

గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచినా.జ‌నాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవడంతో 2014లో ఆయ‌న‌ను ఓడించేశారు.

అదేస‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున అశోక్‌రెడ్డి విజ‌యం సాధించాడు.అయితే, బాబు ఆక‌ర్ష్ మంత్రంతో అశోక్ రెడ్డి టీడీపీ సైకిలెక్కాడు.

దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు త‌న‌కు ద‌క్కే ఛాన్స్ లేద‌ని రాంబాబు భావించాడు.దీనికితోడు మెగా ఫ్యామిలీతో త‌న‌కున్న ప‌రిచ‌యాలు, గ‌తంలోనే పని చేసిన నేపథ్యం ఉన్న కార‌ణంగా జ‌న‌సేన‌లో చేరాల‌ని డిసైడ్ అయ్యాడు.

ఇక‌, గిద్ద‌లూరు టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌న్న ధీమాతో కూడా ఉన్నాడు.మ‌రి ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube