Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జ‌న‌సేన‌లోకి జంపింగ్‌లు స్టార్ట్‌!.. తొలి వికెట్ టీడీపీ నుంచే! -TDP EX-MLA To Join Jana Sena?

దీనిని బ‌ట్టి ప్ర‌కాశం జిల్లాలో ఇప్పుడు టీడీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు పేట్రేగ‌డం, చంద్ర‌బాబు మాట‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం, మ‌రోప‌క్క వైసీపీ పుంజుకుంటుంద‌న్న వార్తల నేప‌థ్యంలో చంద్ర‌బాబు గిద్ద‌లూరు టికెట్‌ను జ‌న‌సేనానికి అప్ప‌గించేశార‌ట‌. ఈ వార్త తెలిసిన రాంబాబు వెంట‌నే టీడీపీకి రాజీనామా చేశాడ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ గిద్ద‌లూరు టికెట్ జ‌న‌సేన‌కు వెళ్తోంది కాబట్టి తాను ఆ పార్టీలోకి జంప్ చేస్తే.. తిరిగి ఆ టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని రాంబాబు మంచి ప్లాన్‌తోనే సైకిల్ దిగేశాడ‌ని అంటున్నారు స్థానిక త‌మ్ముళ్లు.

టికెట్ ద‌క్క‌ద‌నే ఫిరాయింపు!


టీడీపీలో తాను కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌ని అన్నా రాంబాబుకు భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచినా.. జ‌నాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవడంతో 2014లో ఆయ‌న‌ను ఓడించేశారు. అదేస‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున అశోక్‌రెడ్డి విజ‌యం సాధించాడు. అయితే, బాబు ఆక‌ర్ష్ మంత్రంతో అశోక్ రెడ్డి టీడీపీ సైకిలెక్కాడు. దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు త‌న‌కు ద‌క్కే ఛాన్స్ లేద‌ని రాంబాబు భావించాడు. దీనికితోడు మెగా ఫ్యామిలీతో త‌న‌కున్న ప‌రిచ‌యాలు, గ‌తంలోనే పని చేసిన నేపథ్యం ఉన్న కార‌ణంగా జ‌న‌సేన‌లో చేరాల‌ని డిసైడ్ అయ్యాడు. ఇక‌, గిద్ద‌లూరు టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌న్న ధీమాతో కూడా ఉన్నాడు. మ‌రి ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.

Continue Reading
More Posts
To Top