Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జ‌న‌సేన‌లోకి జంపింగ్‌లు స్టార్ట్‌!.. తొలి వికెట్ టీడీపీ నుంచే! -TDP EX-MLA To Join Jana Sena?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌లోకి జంపింగ్‌లు స్టార్ట‌యిపోయాయి. అది కూడా జ‌న‌సేనాని ఎంతో ఇష్ట‌ప‌డే చంద్ర‌బాబు టీంలోని మాజీ ఎమ్మెల్యేనే కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఈ విష‌యం ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర‌తీసింది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత అన్నా రాంబాబు ఇటీవ‌ల టీడీపీకి రాజీనామా చేశారు. అయితే, గిద్ద‌లూరులో యాక్టివ్‌గా ఉండే రాంబాబు ఒక్క‌సారిగా ఇలా పార్టీకి రాజీనామా చేయ‌డంపై అసలు ఏం జ‌రిగి ఉంటుంద‌నే విష‌యంపై అంద‌రి దృష్టీ ప‌డింది. దీంతో ఇప్పుడు అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేంటంటే.. త్వ‌ర‌లోనే రాంబాబు జ‌న‌సేన‌లోకి వెళ్తున్నాడ‌ని స‌మాచారం. అంతేకాకుండా రాంబాబుకు జ‌న‌సేనాని గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ హామీ ఇచ్చాడ‌ని తెలిసింది.

అందుకే అంత ధైర్యంగా టీడీపీ నుంచి రాంబాబు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని స‌మాచారం. ఇక‌, ఇక్క‌డే ఇంకో విష‌యం కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవ‌ల ఉద్దానం కిడ్నీ బాధితుల‌ను ఆదుకునే క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబుతో జ‌న‌సేనాని ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తిలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఓ పావు గంట పాటు ఇద్ద‌రూ ఏకాంతంగా చ‌ర్చించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ చ‌ర్చ‌ల్లోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుని ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లాల‌ని డిసైడ్ అయ్యార‌ని, అదేస‌మ‌యంలో సీట్ల పంప‌కాల పైన కూడా ఇద్ద‌రి మ‌ధ్య కేటాయింపులు జ‌రిగిపోయాయ‌ని స‌మాచారం.

Continue Reading
More Posts
To Top