దాసరి పవన్ సినిమా ఉండే ఛాన్స్ లేదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాసరి నారాయణ రావు కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందంటూ ఓ రెండు సంవత్సారల క్రితం నుండి చెబుతున్న మాట.దాసరి నిర్మాణంలో పవన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉండగా దానికి దర్శకుడిని వెతికే పనిలో కొద్దిరోజులు షో చేశారు.

 Don’t Have Chance Dasari Pawan Movie-TeluguStop.com

మరి ఏమైందో ఏమో గాని పవన్ సినిమా అంటే దాసరి వెనక్కి వెళ్తున్నాడట.దాసరితో సినిమాకు పవన్ రెడీ అంటున్నా దాసరి గారు మాత్రం చూద్దాం.

చేద్దాం అంటున్నారట.ఇక తను స్థాపించిన రాజకీయ పార్టీ కోసం ఇక కెరియర్ లో రెండు మూడు సినిమాల కంటే ఎక్కువ తీయనని చెప్పిన పవన్ ఆల్రెడీ త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు.

అది కచ్చితంగా రాధాకృష్ణ నిర్మాణ సారధ్యంలోనే ఉంటుంది.

ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా శరత్ మరార్ ఆల్రెడీ కమిట్ అయ్యాడు.

సో దాసరితో పవన్ సినిమా కల గానే మిగిలిపోతుందన్నమాట.ఇన్నాళ్లు కథల వేటలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చిన దాసరి సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మాట మారుస్తున్నాడట.

సో మొత్తానికి ఓ క్రేజీ కాంబినేషన్ తెర మీద చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube