పాపని కాపాడి హీరో అయిన కుక్క

తాచుపాము పదునైన కోరలకు ఎదురెళ్లి ఏడేళ్ల బాలికను రక్షించిన జర్మన్ షెపర్డ్ కుక్క ‘హాస్’ అమెరికాలో ఇప్పుడు హీరోగా మారిపోయింది.అమెరికాలోని ఫ్లోరిడా లోని టంపాలో ఆడమ్ డిలుకా ఇంటి పెరట్లో వారి ఏడేళ్ల కుమార్తె ఆడుకుంటోంది.

 Dog Saves 7-year-old Girl From Dangerous Snake-TeluguStop.com

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ తాచుపాము వచ్చింది.ఆడుకుంటున్న బాలిక దగ్గరకు వచ్చి, కాటేసే ప్రయత్నంలో ఉంది.

పాము ప్రయత్నాన్ని గమనించిన, ఒక్క ఉదుటన బాలిక ముందుకు దూకింది.అప్పటికే బాలికను కరిచేందుకు పడగవిప్పిన తాచు కాటుకు కుక్క దొరికిపోయింది.

అయినా కుక్క బెదరలేదు.పాముతో తలపడింది.

ఈ క్రమంలో పాము కుక్కను మూడుసార్లు కాటేసింది.కుక్క ధాటికి బెదిరిపోయిన పాము వెనక్కి వెళ్లిపోయంది.

కుక్క అరుపులు విని, ఇంటిపైనున్న బాలిక నానమ్మ మోలీ డిలుకా కిందికు వచ్చింది.కుక్కకు రక్తస్రావం కావడాన్ని గమనించింది.

కుక్కకాలిపై ఉన్న గాయాలను పరిశీలించిన మోలీ అవి పాముగాట్లుగా గుర్తించింది.వెంటనే ఎమర్జెన్సీ వెటర్నరీ, స్పెషాల్టీ ఆస్పత్రిలో చేర్చారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్న కుక్కకు భారీగా ఖర్చు అవుతుండడంతో జరిగిన ఘటన మొత్తం వివరిస్తూ సోషల్ మీడియాలో విరాళాలు అడిగారు.కుక్క సాహసాన్ని గుర్తించిన నెటిజన్లు పది లక్షల రూపాయలు అవసరం అవుతాయని కోరితే…24 లక్షల రూపాయలు ఇచ్చారు.

దీంతో మిగిలిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు అందజేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube