హైదరాబాద్ ఫేమస్ బిర్యానిలో కుక్కమాంసం వాడుతున్నారా..?

నిన్న సాయంత్రం తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ఓ సంచలనాత్మకమైన వార్త టెలికాస్ట్ అయ్యింది.హైదరాబాద్ లో ఫేమస్ బిర్యాని సెంటర్స్ లో ఒకటైన షాగౌజ్ బిర్యాని లో మటన్ వంటకాల్లో మేక మాంసానికి బదులు కుక్క మాంసం వాడుతున్నారని, అధికారుల తనిఖిలో ఈ విషయం వెల్లడైందని, షాగౌజ్ ఓనర్ ని పోలీసులు అరెస్టు చేశారని వార్తల సారాంశం.

 Dog Meat In Hyderabad Shah Ghouse Biryani Was A Hoax-TeluguStop.com

షాగౌజ్ కి నగరంలో మూడు బ్రాంచులు ఉన్నాయి.రోజు లక్షల్లో బిజినెస్ జరుగుతుంది.

వేలమంది ప్రతీరోజు షాగౌజ్ బిర్యాని తింటుంటారు.దీంతో నగరవాసులు అందోళనకి లోనయ్యారు.

అయితే మీడియా మోసుకొచ్చిన వార్తల్లో నిజం లేదని రుజువైంది.

GHMC అధికారులు షాగౌజ్ ఎక్కడినుంచి మాంసాన్ని తీసుకొస్తున్నారో తనిఖి చేసారు.

మేక మాంసం తప్ప కుక్క మాసం వంటకాల్లో వాడట్లేదని తేలింది.దాన్ని మీడియా మరోలా రాసింది.

సోషల్ మీడియాలో అదే ఫేక్ న్యూస్ ప్రచారం జరిగింది.

అసలు షాగౌజ్ ఓనర్లపై ఎలాంటి కేసు నమోదవలేదు.

ఇక విషయంపై స్పందించిన షాగౌజ్ యాజమాన్యం, ఎవరో తమ బిజినెస్ ని దెబ్బతీయడానికి చేసిన చర్య ఇది అని, అవాస్తవాలు చెప్పిన ఛానెళ్ళపై చర్య తీసుకునేందుకు పోలీసులని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube