ప్రభాస్ కి తాగే అలవాటు లేదా ?

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల వరకు పెద్ద యాక్షన్ హీరో.కండలు తిరిగిన ఆ దేహంతో ఫైట్స్ చేస్తోంటే ఈలలు వేస్తాం మనం.

 Doesn’t Prabhas Drink Much ?-TeluguStop.com

ఆ కటౌట్ చూసి గోలగోల చేస్తాం.కాని సినిమాల వరకే ప్రభాస్ లో ఆ గాంభీర్యం, దూకుడు కనిపిస్తాయి.

నిజజీవితంలో ప్రభాస్ యాక్షన్ హీరో కాదు, డార్లింగ్.బిడియస్తుడు, సౌమ్యుడు.

అందుకే ప్రభాస్ ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇవ్వడు, ఇచ్చినా ఎదో బిడియంగా, సింపుల్ గా మాట్లాడటమే తప్ప, ఎక్కువ సందడి చేయడు.ఇంతమాత్రమే కాదు, ప్రభాస్ కి ఎక్కువగా తాగే అలవాటు కూడా లేదట

బాహుబలి హిందీ పంపిణిదారుడు కరణ్ జోహార్ బాహుబలి సక్సెస్ పార్టి ఇవ్వబోతున్నాడు.

బాహుబలి టీం, బాలివుడ్ బడా సెలబ్రిటీలు అంతా ఈ పార్టికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాడు.కాని ప్రభాస్ ఈ పార్టికి హాజరవడం అనుమానమే అంట.ఎందుకో తెలుసా ? రెండు కారాణాలు ఉన్నాయి

ఈ పార్టీలు మన తెలుగు హీరోలకి మొదటినుంచి అలవాటు లేదు.ఇక బాలివుడ్ పార్టీ అంటే ఎలా ఉంటుంది.

అసలే ప్రభాస్ కి బిడియం, మొహమాటం ఎక్కువ.బాలివుడ్ జనాల గోల, వారి గొడవలు, ఆ తాగుడు .ఈ వాతావరణం ప్రభాస్ కి నప్పుదు.అందుకే పార్టికి రాలేను అని కరణ్ జోహార్ కి సున్నితంగా చెప్పాడట.

అయినా కరణ్ ప్రభాస్ ని ఒప్పించే ప్రయత్నాలు మానట్లేదు.ఎంతైనా కథానాయకుడు లేకపోతె పార్టి కళ తప్పుతుంది కదా.మరి మన డార్లింగ్ మనసు మార్చుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube