క్రికేట్ అనేది భారతదేశంలో ఓ మతం.ఇంకోలా చెప్పాలంటే, హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు .
ఉన్న మిగితా మతాల వారంతా కలిసికట్టుగా జపించే మంత్రం క్రికేట్.అంత పిచ్చి ఉంది కాబట్టే, ఐపియల్ లాంటి టోర్నమెంట్ ప్రతి ఏడాది వేలకోట్ల బిజినెస్ చేస్తోంది.
కేవలం క్రికేట్ ద్వారానే కాదు, ఆ ఇమేజ్ తో యాడ్ రంగంలో కూడా కోట్లకొద్దీ పిండుకుంటున్నారు స్టార్ ఆటగాళ్ళు.
మరీ భారతదేశంలో ఉన్న విపరీతమైన పిచ్చి లేకపోయినా, క్రికేట్ ఆడే మిగితా దేశాల్లో కూడా ఈ ఆటకు మంచి క్రేజ్ ఉంది.మరి అంతర్జాతీయంగా అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్స్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారో చూద్దామా!
1) విరాట్ కొహ్లి – 5811.21 రూపాయలు
2) ధోని – 3638.30 రూపాయలు
3) క్రిస్ గేల్ – 950.34 రూపాయలు
4) షాహిద్ ఆఫ్రీది – 798.19 రూపాయలు
5) సెహ్వాగ్ – 734.41 రూపాయలు
6) షేన్ వాట్సన్ – 696.71 రూపాయలు
7) ఏబి డివిలియర్స్ – 696.71 రూపాయలు
8) గౌతమ్ గంభీర్ – 633.15 రూపాయలు
9) యువరాజ్ సింగ్ – 481.19 రూపాయలు
10) మైకల్ క్లార్క్ – 367.57 రూపాయలు
నోట్ : రిటైర్ అయిన క్రికేటర్స్ ని పరిగణనలోకి తీసుకోలేదు.మైకల్ క్లార్క్ రిటైర్ అయినప్పటికీ, పునరాగమనం చేసే అలోచనలో ఉన్నాడు.