కుక్కల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు

కుక్కలు విశ్వాసం గల జీవులు.తమని పెంచుకుంటున్న కుంటుంబంపై అవి చూపే ప్రేమ, మనుషులు కూడా చూపించలేరేమో.

 Divorced Couple Moves To Court For 3 Dogs In Canada-TeluguStop.com

అంత నమ్మకంగా ఉంటాయి కాబట్టే కొందరు వాటిని తమ పిల్లలతో సామానంగా ప్రేమగా చూసుకుంటారు.మరి పిల్లలే లేని జంట కుక్కలని పెంచుకుంటే ఇంకెంత ప్రేమగా చూసుకోవాలి !

కెనెడాకి చెందిన ఓ జంటకి పెళ్ళి జరిగి 16 ఏళ్ళు గడిచినా సంతానం లేదు.

వీరు మూడు కుక్కలని పెంచుకుంటూ వాటినే పిల్లలలాగా చూసుకుంటూ వచ్చారు.ఇద్దరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకున్నారు.

తీసుకుంటే తీసుకున్నారు .వీరిద్దరి మధ్య అసలు గొడవ కుక్కలు ఎవరి దగ్గర ఉండాలని.

తెలిసిందేగా, విడాకులు తీసుకున్న తరువాత పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనే విషయం మీద గొడవ జరిగితే కోర్టు తీర్పునిస్తుందని.అదేవిధంగా అ మూడు కుక్కలు ఎవరి దగ్గర ఉండాలనే విషయం మీద కోర్టుకెక్కారు భార్యభర్తలు.

దానికి కోర్టు ఎలా రెస్పాండ్ అయ్యిందో తెలుసా.ఇద్దరికీ చివాట్లు పెట్టారంట జడ్జీ.

కుక్కలు ఏమైనా మనుషులా, మీ సొంత పిల్లల్లా కోర్టుకి రావడానికి, అవి ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర ఉంచుకోండి, లేదంటే అమ్మెయ్యండి అంటూ ఆ మాజీ భార్యభర్తలను మందలించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube