‘పాపనాశం’కు తప్పని తిప్పలు

కమల్‌ హాసన్‌ వచ్చే నెలలో తమిళ ప్రేక్షకుల ముందుకు ‘పాపనాశం’ సినిమాతో రాబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.‘పాపనాశం’ విడుదల తేదీని అధికారికంగా కమల్‌ హాసన్‌ ప్రకటించాడు.

 Distributors Problems For Papanasam-TeluguStop.com

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘పాపనాశం’ విడుదల వాయిదా వేశారు.జులై 3న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న ‘పాపనాశం’కు అడ్డంకులు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను విడుదల చేసే ముందు తమను ఆదుకోవాలి అంటూ ‘ఉత్తమ విలన్‌’ సినిమా డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

‘ఉత్తమ విలన్‌’ సినిమా వల్ల తాము చాలా నష్టపోయాం అని, భారీ స్థాయిలో సక్సెస్‌ అవుతుంది అంటూ తమ వద్ద భారీ మొత్తాలు వసూళ్లు చేశారు.

ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో తమకు కోట్లలో నష్టం వాటిల్లింది అంటూ డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు.తమ నష్టానికి పరిహారం చెల్లిస్తే తప్ప ఈ సినిమాను విడుదల చేయనిచ్చేది లేదు అంటూ తేల్చి చెబుతున్నారు.

దాంతో కమల్‌ హాసన్‌ ఆలోచనల్లో పడ్డాడని తెలుస్తోంది.అందుకే ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టడం లేదు అని, ఎప్పుడు విడుదల చేసేది కూడా కమల్‌ నిర్ణయించుకోలేక పోతున్నాడు అంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube