బన్నీ అంటే పడి చస్తోంది

స్టైలిష్‌ స్టార్‌ బన్నీ అంటే ప్రేక్షకులతో పాటు స్టార్స్‌ కూడా అభిమానమే.ముఖ్యంగా చిన్న హీరోయిన్స్‌కు బన్నీ అంటే చాలా మోజు.

 Disha Patani Wants To Dance With Allu Arjun-TeluguStop.com

బన్నీతో ఒక్క సినిమాలో అయినా నటించాలని హీరోయిన్స్‌ కోరుకుంటూ ఉంటారు.తాజాగా ఇదే జాబితాలో దిశా పటాని చేరింది.

ఈ అమ్మడు ఇటీవలే ‘లోఫర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమాతో ఈమెకు హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

అయినా కూడా ఈమె టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది.ఇక ఈమె ప్రస్తుతం బన్నీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటే ప్రయత్నం చేస్తూనే, ఆయన సరసన హీరోయిన్‌గా అవకాశం కొట్టేయాలని ప్రయత్నిస్తోంది.

తాజాగా దిశా పటాని మాట్లాడుతూ.బన్నీ అంటే తకు చాలా అభిమానం అని, ఆయన డాన్స్‌ వేస్తుంటే తాను అలా చూస్తూనే ఉండి పోతాను అని, ఆయన డాన్స్‌లోని స్పీడ్‌ నన్ను ఆయన అభిమానిగా మార్చింది అని చెప్పుకొచ్చాడు.

ఆయనతో ఒక్క సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని, హీరోయిన్‌గా కాకున్నా కనీసం ఐటెం సాంగ్‌లో అయినా లేక ముఖ్య పాత్రలో అయినా నటించేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో నటించినా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

అందుకే బన్నీతో ఒక సినిమా చేయాలని కోరుకుంటుంది.మరి బన్నీ ఈమెకు అవకాశం ఇస్తాడా అనేది చూడాలి.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube