పెద్ద కన్ ఫ్యూజన్ లో ఉన్న వంశీ పైడిపల్లి..!

కెరియర్ లో హిట్స్ కొడుతున్నా సరైన ఆలోచన విధానం లేకుండా ఓ దర్శకుడు కెరియర్ ఎటుకాకుండా చేసుకుంటున్నాడు.తీసిన సినిమాల్లో ఒకటి రెండు తప్ప మిగతావన్ని మంచి ప్రేక్షకాదరణ కలిగిన సినిమాలైనా సరే ఎందుకో వెంటనే అవకాశాలు అందుకోలేకపోతున్నాడు.

 Vamsi Paidipally Is In Big Confusion-TeluguStop.com

ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే వంశీ పైడిపల్లి అనేస్తున్నారు.ఊపిరి హిట్ తర్వాత వంశీ పైడిపల్లికి అక్కినేని అఖిల్ రెండవ సినిమా అవకాశాన్ని ఇచ్చాడని అన్నారు.

అయితే అఖిల్ మాత్రం వంశీ డైరక్షన్లో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు.

ఇక ఆ క్రమంలో మహేష్ తో కూడా సినిమా ఓకే చేయించుకున్న వంశీ పైడిపల్లి అది కూడా వచ్చే ఏడాది అన్నట్టు తెలుస్తుంది.

అయితే సంవత్సరం పాటు మహేష్ కోసం వెయిట్ చేయకుండా మధ్యలో ఓ సినిమా ప్లాన్లో ఉన్నాడు వంశీ పైడిపల్లి.తను తీసిన ప్రతి సినిమా మంచి కథ కథనాలతో సాగేలా చూసుకునే వంశీ పైడిపల్లి ఇలా సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

మరి మహేష్ సినిమా కోసం వెయిట్ చేస్తాడో మరో హీరోతో సినిమా ఓకే చేయించుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube