100వ సినిమా దర్శకుడు ఖరారు

చిరంజీవి 150వ సినిమాపై ఎంత ఆతృతగా మెగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఉన్నారో అంతే ఆతృతతో నందమూరి ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు బాలకృష్ణ 100వ సినిమా కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం 99వ సినిమా ‘డిక్టేటర్‌’లో నటిస్తున్న బాలయ్య ఇదే సంవత్సరం చివర్లో తన వందవ సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి.

 Director Confirmed For Balakrishna’s 100th Film-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా కోసం బాలయ్య దాదాపుగా సంవత్సర కాలంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఒక పవర్‌ ఫుల్‌ కథథో బాలయ్య తన 100వ సినిమాను చేయాలని ఆశ పడుతున్నాడు.

ఇంత కాలం బాలయ్య తన వందవ సినిమాను ఎవరి దర్శకత్వంలో చేయాలా అని ఆలోచించాడు.అయితే మొదటి నుండి కూడా బాలయ్య మదిలో బోయపాటి శ్రీను పేరు మెదులుతూనే ఉంది.

అయితే ఆయన కాకుండా మరెవ్వరైనా తనను పవర్‌ ఫుల్‌గా చూపించగలరా అని వెదికాడు.అయితే బాలయ్యకు మరే ప్రత్యామ్నాయం దొరికినట్లుగా లేదు.

‘సింహ’, ‘లెజెండ్‌’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలను తనకు ఇచ్చిన బోయపాటికే తన 100వ సినిమా అప్పగించడం నూటికి నూరు పాల్లు సమంజసం అని బాలయ్య భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ ప్రతిష్టాత్మక సినిమా నిర్మాణ బాధ్యతలను సాయి కొర్రపాటికి అప్పగించనున్నాడు.

‘డిక్టేటర్‌’ పూర్తి అయిన వెంటనే 100వ సినిమా ప్రకటన ఉండే అవకాశాలున్నాయి.మరో వైపు అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా మొదలు పెట్టబోతున్నాడు.

బాలయ్య, బోయపాటిల కాంబినేషన్‌లోని ఈ మూడవ సినిమా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకులను అలరించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube