దిల్రాజు ప్రొడక్షన్ అంటేనే ఉమ్మడి కుటుంబంలాగా ఉంటుంది.దర్శకుడైనా, హీరో అయినా ఫైనల్గా దిల్రాజు మాట విని తీరాల్సిందే.
స్టోరీ డిస్కషన్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాడు దిల్రాజు.పాత తరం నిర్మాతలు చేసే ఆ పనులను ఈ కాలంలో చేస్తున్న యువ నిర్మాత దిల్రాజు.
ఇటీవల ఈయన తన హీరోకు వార్నింగ్ ఇచ్చాడట.ఆ హీరో మరెవరో కాదు రవితేజ.
ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్లో రవితేజ ఎవడో ఒకడు అనే సినిమాలో నటిస్తున్నారు.ఓ మై ఫ్రెండ్ చిత్రాన్ని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ని దిల్రాజు ఆపేశాడట.రవితేజ బరువు పెరిగితే కానీ, ఈ సినిమా షూటింగ్ మొదలు కాదని కచ్చితంగా చెప్పేశాడట.
ఇటీవల రవితేజ మరీ బక్క చిక్కిపోయి, ముఖమంతా పీల్చుకుని పోయి కనిపిస్తున్న సంగతి తెలిసిందే.రవితేజకి ఏమైనా ఆరోగ్యం బాగాలేదా? అని కూడా చాలా మందికి డౌట్ వస్తోంది.అయితే మితిమీరిన డైటింగ్ చేయడం వల్లే రవితేజ అలా అయిపోయాడని సన్నిహితులు అంటున్నారు.ఏదేమైనా రవితేజ ప్రస్తుత లుక్ బాగా లేదని, తన ఎవడో ఒకడు సినిమా కోసం మరింత పెరగాల్సిందేనని హుకుం జారీచేశాడట దిల్ రాజు.
అదన్నమాట సంగతి.