ATM ని కేవలం డబ్బు తీసుకోవడానికే కాదు .. ఇలాంటి అవసరాలకి కూడా వాడొచ్చు

మన దేశంలో రెండు లక్షలకి పైగా ఏటిఏంలు ఉన్నాయి.పెద్ద పెద్ద పట్టణాల దగ్గరినుంచి మండలాలు, కొన్ని గ్రామలవరకు కూడా ఎటిఏంలు సేవలు అందిస్తున్నాయి.

 Different Uses Of Atm Other Than Cash Withdrawal-TeluguStop.com

సడెన్ గా వచ్చే డబ్బు అవసరాలను తీరుస్తూ, ప్రతి అవసరానికి బ్యాంకు దాకా వెళ్ళాసిన అవసరం లేకుండా చేస్తున్నాయి.కాని ఇప్పటికే చాలామందికి ఏటిఏం అంటే కేవలం డబ్బులు బయటకి తీసుకునే మిషిన్ అని మాత్రమే తెలుసు.100% మంది ఏటిఏం ని కేవలం డబ్బులు విత్ డ్రా చేయాడానికి తప్ప, మిగితా సేవల కోసం వాడట్లేదు అని సర్వేలు చెబుతున్నాయి.మరి మిగితా సేవలను ఎందుకు వినియోగించుకోవట్లేదు ? అవగాహన లేకే కదా ? అందుకే ఆ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.

* ATM నుంచే మోబల్ రిచార్జీ చేసుకోవచ్చు తెలుసా ? అవును, మీరు రోడ్డు మీద ఉన్నారు, ఆన్ లైన్ రిచార్జీ చేసుకుందామంటే ఇంటర్నెట్ లేదు అనుకోండి, వెంటనే ATM కి వెళ్లి, SERVICES ఆప్షన్ క్లిక్ చేసి Mobile Top Up నుంచి రిచార్జీ చేసుకోండి.

* కరేంట్ బిల్, విద్యార్థులు పరీక్షలు ఫీజు, కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు సంబంధించిన ఫీజు, విమాన టికెట్ బుకింగ్ .ఇవన్ని ATM నుంచే చేసుకోవచ్చు.అదే SERVICES ఆప్షన్ లో ఇవన్ని దాగున్నాయి.

* మీరు చెక్ బుక్ కి అప్లై చేసుకోవాలంటే కూడా బ్యాంకు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు.మీ ఖాతాలో మీ అడ్రెస్ కరెక్టుగా ఉంటే చాలు, ATM నుంచే చెక్ బుక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

* ఇక కార్డ్ టూ కార్డు ట్రాన్సాక్షన్ గురించి మీకు తెలిసే ఉంటుంది.ఒకే బ్యాంకు కార్డు వాడుతున్న ఇద్దరు ATM ద్వారా ఒకరికి ఒకరు డబ్బు పంపించుకోవచ్చు.

* మీ ట్రాన్సాక్షన్ అప్డేట్స్ కోసం మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ATM నుంచే చేసుకోవచు, అలాగే ఉన్న మొబైల్ నంబర్ మార్చేసి కొత్త మొబైల్ నంబర్ పెట్టుకోవచ్చు.ఇకే ATM పిన్ మార్చుకోవడం మీకు తెలిసే ఉంటుంది.

* మీది ఫిక్స్డ్ డిపాజిట్ ఎకౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, పెద్ద పెద్ద ఆలయాలకు విరాళాలు ఇవ్వడం, గత 5-10 ట్రాన్సాక్షన్స్ యొక్క మినీ స్టేట్మెంట్ తీసుకోవడం .ఇవన్ని ATM నుంచే చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube