వివాహాలు ఎన్ని రకాలో తెలుసా?

వివాహాలు ఎన్ని రకాలు అని అడిగితె ఎవరు సమాధానం వేంటనే చెప్పలేరు.ప్రాంతాన్ని బట్టి అక్కడి ఆచార వ్యవహారాలను బట్టి వివాహాలు భిన్నమైన రీతిలో జరుగుతూ ఉంటాయి.

 Different Types Of Indian Weddings-TeluguStop.com

అయితే ఏ వివాహం అయినా ఇప్పుడు చెప్పే 8 రకాల వివాహాల్లో ఎదో ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1.బ్రహ్మం – ఈ వివాహంలో వరుణ్ణి ఎంపిక చేసుకొని, తన కూతురుని వివాహం చేసుకోమని అడిగి చేసే వివాహం బ్రహ్మ వివాహం.

2.దైవం – యజ్ఞ యాగాదులు చేసే రుత్విజునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం దైవ వివాహం.

3.అర్షం – ఒకప్పుడు గో సంపదను చూసి వివాహం చేసేవారు.అలాంటి రెండు గోవులను స్వీకరించి తన కుమార్తెకు వివాహం చేయటం అర్ష వివాహం.

4.ప్రాజాపత్యం – ఇక నుంచి గృహస్థాశ్రమంలో ఉంటూ తనకు అందించిన కన్యను కంటికిరెప్పలా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ వివాహం చేసుకోవడం ప్రాజాపత్య వివాహం.

5.అసురం – తన కూతురిని ఇచ్చి వివాహం చేయటానికి వీలైనంత కన్యాశుల్కాన్ని తీసుకున్న తర్వాతే వివాహం చేయటాన్ని అసుర వివాహం అని అంటారు.

6.గాంధర్వం – పెద్దవారి ప్రమేయం లేకుండా వధూవరులిద్దరూ పరస్పర అంగీకారంతో చేసుకుంటే ఆ వివాహాన్ని గాంధర్వ వివాహం అని అంటారు.

7.రాక్షసం – తాను ఇష్టపడిన అమ్మాయిని బంధువుల అభిష్టానికి వ్యతిరేకంగా ఎత్తుకువెళ్లి చేసుకొనే వివాహాన్ని రాక్షస వివాహం అని అంటారు.

8.పైశాచికం – నిద్రిస్తున్న స్త్రీ శీలాన్ని అపహరించి ఆపై ఆమెను పెళ్లి చేసుకోవటం పైశాచిక వివాహం అవుతుంది.

Different Types Of Indian Weddings

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube