Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Featured

చిరు-ప‌వ‌న్ మ‌ధ్య చాలా తేడా ఉందే..!-Difference Between Chiru-Pawan In Politics

పాలిటిక్స్ అన్నాక ఎవ‌రి లెక్క‌లు వాళ్ల‌వి! భ‌ర్త ఒక పార్టీలో ఉంటే.. భార్య మ‌రో పార్టీలో అధికారం వెల‌గ‌బెట్టిన సంగ‌తులు కూడా దేశానికి కొత్త‌కాదు. నిజానికి రాజ‌కీయాలంటేనే అలా ఉంటాయి! ఇప్పుడు ఇక్క‌డ ఏపీలోనూ జ‌న‌సేనాని ప‌వ‌న్‌, ఆయ‌న అగ్ర‌జుడు, మెగాస్టార్ చిరంజీవికి మ‌ధ్య పొలిటిక‌ల్‌గా అనేక సారూప్య‌తులున్న‌ప్ప‌టికీ.. అదేస‌మ‌యంలో అనేక తేడాలు కూడా క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. చిరంజీవి సొంతంగా ప్ర‌జారాజ్యం పేరుతో ఎకాఎకి బ‌రిలోకి దిగిపోయాడు. అదృష్టం క‌లిసి వ‌స్తే.. సీఎం సీటు ద‌క్కించుకుందామ‌నుకున్నా.. అది ద‌క్క‌లేదు. దీంతో త‌న ఎమ్మెల్యేల‌తో క‌లిసి.. చిరు ఒక రోజు కాంగ్రెస్‌లో చేరిపోయారు.

అయితే, ప్ర‌జారాజ్యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన యువ‌రాజ్యం నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్ప‌టి రాజ‌కీయ స్ఫూర్తిని తీసుకుని జ‌న‌సేన పేరుతో తిరిగి అరంగేట్రం చేశారు. అయితే, ఈయ‌న ఎలాంటి కేడ‌ర్‌ను ఏర్పాటు చేసుకోలేదు. అంతేకాదు, ప్ర‌ధాన పార్టీ స‌ల‌హాదారులు ఓ క‌మిటీ అంటూ ఏమీ లేకుండానే జ‌న‌సేన న‌డుస్తోంది. అయితే, ఇక్క‌డ విశేషం ఏంటంటే.. పుట్టి మూడు వారాలు కూడా కాకుండానే రాజ‌కీయ మేధావులైన చంద్ర‌బాబు, న‌రేంద్ర మోదీ వంటి వారికి 2014 ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తిచ్చి.. త‌న స‌త్తా ఏంటో చూపించాడు ప‌వ‌న్‌. అంతేకాదు, ప‌వ‌న్ లేక‌పోతే… మా ప‌రిస్థితి ఏంటి? అనే రేంజ్‌కి ఆ పార్టీల‌ను తీసుకెళ్ల‌గ‌లిగాడు ప‌వ‌న్‌.

ఇప్పుడు ఈ విష‌యంలోనే అటు చిరంజీవి, ఇటు ప‌వ‌న్‌ల‌పై చ‌ర్చ న‌డుస్తోంది. అన్న చిరు.. పార్టీని స్థాపించి ఓ రేంజ్‌లో ఉన్న స‌మ‌యంలో కాంగ్రెస్‌లో వీలీనం చేసేయ‌డం, మ‌రి ప‌వ‌న్ కేవ‌లం పార్టీ పేరును మాత్ర‌మే పెట్టి.. ఏమీ ఏర్పాటు చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రానికి ఇటు రాష్ట్రంలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వడం జ‌రుగుతోంది. ఈ విష‌యంలోనే అన్న‌ద‌మ్ముల పొలిటిక‌ల్ మైండ్ సెట్స్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది. చిరు, ప‌వ‌న్ రాజ‌కీయ తేడాల‌పై ఇప్పుడు అంద‌రిలోనూ చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాలు చేసేని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గా ఎంట్రీ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక పొలిటిక‌ల్‌గా ప్లాప్ షో వేసిన చిరు ఇప్పుడు కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి…ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. మ‌రి ఈ అన్న‌ద‌మ్ముల్లో ఎవ‌రు ఫ్యూచ‌ర్‌లో ఎలా రూటు మారుస్తారో చూడాలి.

Continue Reading

More in Telugu News

 • GENRAL

  3000 new jobs available in Banking sector

  By

  బ్యాంక్ కోచింగ్ కి వెళుతూ పుస్తకాలతో పోటిపడుతున్న విద్యార్థులు, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో గవర్నమెంటు జాబ్ పొందాలనుకునేవారు .. ఈ సమాచారం మీకోసమే....

 • GENRAL

  Useful tips for a slow running computer

  By

  కంప్యూటర్ కొన్న కొన్నాళ్ళకు నెమ్మదిస్తుంది. కంప్యూటర్ పనితీరుపై సరైన అవగాహన లేనివారు ఇది అందరికీ జరిగేదే అని గమ్మునుంటారు. కాని అవగాహన...

 • NEWS

  Vijayashanti in Tamil Nadu Cabinet

  By

  వెండితెర‌పై ఎంతోమంది స్టార్ హీరోల‌తో న‌టించి ఓ వెలుగు వెలిగింది లేడీ సూప‌ర్‌స్టార్ అమితాబ‌చ్చ‌న్‌. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా స‌త్తా...

 • NEWS

  TDP MLC candidates list

  By

  ఏపీలో అధికార టీడీపీ నుంచి శాస‌న‌మండ‌లికి వెళ్లే పెద్ద‌ల జాబితా ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. సామాజిక‌వ‌ర్గాలు, ప్రాంతాల‌ను భేరీజు వేసుకున్న...

To Top
Loading..