నాన్నకు ప్రేమతో నిజంగానే 50 కోట్లు చేసిందా ?

ఒక నిరుద్యోగిని పట్టుకొని , బంధువులు అంతా, ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే ఎంత నరకంగా ఉంటుందో , 50 కోట్లు ఎప్పుడు 50 కోట్లు ఎప్పుడు అంటూ మిగితా హీరోల ఫ్యాన్స్ అంతకన్నా పెద్ద నరకాన్ని చూపించారు ఎన్టీఆర్ అభిమానులకి.ఇన్ని సంవత్సారాల తరువాత 50 కోట్ల సినిమా అయితే రానే వచ్చింది .

 Did Really Nannaku Prematho Earn 50 Crore ?-TeluguStop.com

కాని లెక్కలే తేడా కొడుతున్నాయి.మగధీర దూకుడు చిత్రాల తరువాత మళ్ళి ఆ రేంజ్ లో కలెక్షన్లు వివాదస్పదమవడం నాన్నకు ప్రేమతో చిత్రానికే జరిగింది.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా లెక్కలపై ట్రేడ్ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.సినిమా కలెక్షన్లు ఆగిపోతాయని తెలిసే మొదటివారం కలేక్షన్లలోనే అవసరమైనంత కలిపెసారని, తెలుగు రాష్ట్రాల్లో రాని కేలేక్షన్లు పక్క రాష్ట్రాల్లో ఎలా వస్తున్నాయని, 50 కోట్లు ఈసారైనా కొట్టాలనే పెంచుకుంటూపోయారని ఒక వర్గం వాదిస్తోంటే, నిర్మాత చెప్పిన కలెక్షన్లే వేద వాక్కు అన్నట్టుగా వాటిని కళ్ళకు అద్దుకుంటున్నారు మరికొందరు.ఈ మధ్యకాలంలో ఏ చిత్రానికి జరగనట్టుగా, 50 కోట్లు కొట్టేసాం అని నిర్మాత ప్రెస్ నోట్ విడుదల చేయడంతో ఎన్టీఆర్ అంటి ఫ్యాన్స్ కి మరో కొత్త అవకాశం ఇచ్చినట్టు అయింది.

50 కోట్లు కొట్టామన్న సంతృప్తి ఎంతుందో, అంటే అసంతృప్తి కూడా ఉంది ఎన్టీఆర్ అభిమానుల్లో.ఏమిటో ఈ సినిమా లెక్కలు.ట్రేడ్ చిక్కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube