దానికి 80 కోట్లు అడుగుతున్న ప్రభాస్ ... అప్పుడే అంత పొగరా అంటున్నారు

రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ బాహుబలికి ముందు వేరు, బాహుబలి తరువాత వేరు.బాహుబలికి ముందు ప్రభాస్ ని టాలివుట్ టాప్ 3 లో కూడా లెక్కేసేవారు కాదు.

 Did Prabhas Demand 80cr For A Film With Salman?-TeluguStop.com

ప్రభాస్ పారితోషికం కూడా మహేష్, పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల తరువాత ఉండేది.కాని ఇప్పుడు ప్రభాస్ పారితోషికం వీరికంటే ఎక్కువే అయ్యేలా ఉంది.

కేవలం వీరికంటే ఏమిటి ? ప్రభాస్ ఖాన్స్ ని కూడా దాటేలా ఉన్నాడు అంటున్నారు బాలివుడ్ సినీవర్గాలు.

ఎంతవరకు నిజమో తెలియదు కాని, బాలివుడ్ మీడియా కబుర్లని అనుసరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే, బాలివుడ్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సల్మాన్ ఖాన్ – ప్రభాస్ లతో ఓ మల్టిస్టారర్ తీసే ఆలోచనలో ఉన్నాడట.

దీన్ని హిందీ – తెలుగు భాషల్లో ద్విభాష చిత్రంగా చేయాలని రోహిత్ ప్లాన్ అంట.ఈ ప్రాజెక్టు విషయమై రోహిత్ ప్రభాస్ తో మాట్లాడితే దిమ్మతిరిగే రెమ్యునరేషన్ అడిగాడట.పాతిక కోట్లయితే అదోరకం, పోని యాభై అయినా, మార్కేట్ ఉన్న హీరో అని ఇచ్చేయొచ్చు కాని ప్రభాస్ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేసాడని, ప్రభాస్ అప్పుడే అంత పొగరు ఎందుకని బాలివుడ్ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోంది.ఈ విషయం మీద ప్రభాస్ స్పందించేవరకు ఇందులో నిజమెంతో మనకు తెలియదు.

ఒకవేళ ప్రభాస్ 80 కోట్లు కోరడం నిజమైతే అది టూ మచ్.టాలివుడ్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ మహేష్ తీసుకునే పాతిక కోట్లు.బాలివుడ్ ఖాన్ త్రయంలో సల్మాన్ – షారుఖ్ 50-60 కోట్ల మధ్య తీసుకుంటే, ఆమీర్ మాత్రం పారితోషికం తీసుకోకుండా, సినిమా హిట్ అయ్యాక లాభాల్లో వాట తీసుకుంటూ వంద కోట్లకు పైగానే జేబులో వేసుకుంటాడు.మరి ఇప్పుడు ప్రభాస్ అడుగుతున్న మొత్తం రజినీకాంత్, సల్మాన్, షారుఖ్ ల కంటే ఎక్కువ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube