ధనుష్‌ కోరిక ఈసారైనా తీరేనా?

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఇటీవలే ‘వీఐపీ’ సినిమాతో మంచి విజయం సాధించిన విషయం తెల్సిందే.తమిళంలో స్టార్‌ హీరోగా మంచి క్రేజ్‌ ఉన్న ధనుష్‌కు తెలుగులో కనీస గుర్తింపు కూడా లేదు.

 Dhanush To Release Vip Movie In Telugu-TeluguStop.com

తమిళంలో ధనుష్‌ తర్వాతి స్థానంలో ఉండే కార్తి తెలుగులో మంచి గుర్తింపు ఉన్న హీరోగా నిలిచాడు.అందుకే ధనుష్‌ కూడా చాలా కాలంగా తెలుగులో గుర్తింపు తెచ్చుకోవాలనే పరితపిస్తున్నాడు.

ఆక్రమంలోనే ‘వీఐపీ’ డబ్బింగ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘వీఐపీ’ని మొదట రామ్‌ హీరోగా రీమేక్‌ చేయాలని నిర్ణయించారు.

కాని కొన్ని కారణాల వల్ల ఈ రీమేక్‌ సెట్స్‌ పైకి వెళ్లలేదు.దాంతో డబ్బింగ్‌ చేసి విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తున్నాడు.తాజాగా ఆడియో విడుదలైన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరి ఈ సినిమాతో అయినా ధనుష్‌కు తెలుగులో ఎంట్రీ దక్కుతుందేమో చూడాలి.తమిళనాట మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో సక్సెస్‌ అయ్యేనో లేదో అనే విషయం ఆసక్తికరంగా ఉంది.

ఇక ఈ సినిమాలో అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube