దేవినేని వార‌సుడి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంటి..!

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు తిరుగులేని కింగ్‌గా ఉన్నారు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ.స్టూడెంట్ లీడ‌ర్‌గా ప్రారంభ‌మైన నెహ్రూ ప్ర‌స్థానం ఎమ్మెల్యేగా, మంత్రిగాను, ఉమ్మ‌డి రాష్ట్రంలో స‌ప‌రేట్ ఇమేజ్ ఉన్న నాయ‌కుడి వ‌ర‌కు కొన‌సాగింది.

 Devineni Avinash Political Future..?-TeluguStop.com

కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూ ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు.తెలుగుదేశంలో సంక్షోభం ఏర్ప‌డిన‌ప్పుడు కూడా నెహ్రూ ఎన్టీఆర్ వైపే ఉన్నారు.

ఎన్టీఆర్ మృతి త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్ నుంచి 2004లోను ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూ 2009, 2014 ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు.

రాజ‌కీయంగా తన ప్ర‌స్థానాన్ని ముగించాల‌నుకున్న ఆయ‌న త‌న కుమారుడు అవినాష్‌ను ఎమ్మెల్యేగా చూడాల‌న‌ని క‌ల‌లు కంటూ ఉండేవారు.ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లోనే నెహ్రూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఆయ‌న త‌న‌యుడు అవినాష్ విజ‌య‌వాడ లోక్‌స‌భ‌కు ఎంపీగా పోటీ చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో కాంగ్రెస్‌కు మైన‌స్‌గా మార‌డంతో ఈ ఇద్ద‌రూ ఓడిపోయారు.

ఇక చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత నెహ్రూ త‌న కుమారుడితో పాటు సొంత గూడు టీడీపీకి చేరుకున్నాడు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవినాష్‌కు టిక్కెట్టు ఇచ్చే అంశం కూడా చంద్ర‌బాబు వ‌ద్ద ఇప్ప‌టికే ఉంది.నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే అవినాష్‌కు జిల్లాలో ఎక్క‌డో ఓ చోట నుంచి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సుముఖ‌త వ్య‌క్తం చేశారు.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌ని ప‌క్షంలో పెన‌మ‌లూరు సీటు నుంచి కూడా అవినాష్ పేరు లైన్లో ఉంది.

అలాగే టీడీపీకి గ‌తంలో కంచుకోట‌గా ఉన్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ అభ్య‌ర్థిగా కూడా అవినాష్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌న కుమారుడిని టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా నిల‌బెట్టి గెలిపించుకోవాల‌ని నెహ్రూ ఎన్నో క‌ల‌లు క‌న్నారు.కానీ అవి తీర‌కుండానే ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అవినాష్‌కు పొలిటిక‌ల్‌గా ఎలాంటి ప్ర‌యారిటీ ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube