Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

దేవినేని వార‌సుడి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంటి..!-Devineni Avinash Political Future..?

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు తిరుగులేని కింగ్‌గా ఉన్నారు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ. స్టూడెంట్ లీడ‌ర్‌గా ప్రారంభ‌మైన నెహ్రూ ప్ర‌స్థానం ఎమ్మెల్యేగా, మంత్రిగాను, ఉమ్మ‌డి రాష్ట్రంలో స‌ప‌రేట్ ఇమేజ్ ఉన్న నాయ‌కుడి వ‌ర‌కు కొన‌సాగింది. కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూ ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. తెలుగుదేశంలో సంక్షోభం ఏర్ప‌డిన‌ప్పుడు కూడా నెహ్రూ ఎన్టీఆర్ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ మృతి త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్ నుంచి 2004లోను ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూ 2009, 2014 ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు. రాజ‌కీయంగా తన ప్ర‌స్థానాన్ని ముగించాల‌నుకున్న ఆయ‌న త‌న కుమారుడు అవినాష్‌ను ఎమ్మెల్యేగా చూడాల‌న‌ని క‌ల‌లు కంటూ ఉండేవారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లోనే నెహ్రూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఆయ‌న త‌న‌యుడు అవినాష్ విజ‌య‌వాడ లోక్‌స‌భ‌కు ఎంపీగా పోటీ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో కాంగ్రెస్‌కు మైన‌స్‌గా మార‌డంతో ఈ ఇద్ద‌రూ ఓడిపోయారు.

ఇక చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత నెహ్రూ త‌న కుమారుడితో పాటు సొంత గూడు టీడీపీకి చేరుకున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవినాష్‌కు టిక్కెట్టు ఇచ్చే అంశం కూడా చంద్ర‌బాబు వ‌ద్ద ఇప్ప‌టికే ఉంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే అవినాష్‌కు జిల్లాలో ఎక్క‌డో ఓ చోట నుంచి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌ని ప‌క్షంలో పెన‌మ‌లూరు సీటు నుంచి కూడా అవినాష్ పేరు లైన్లో ఉంది.

అలాగే టీడీపీకి గ‌తంలో కంచుకోట‌గా ఉన్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ అభ్య‌ర్థిగా కూడా అవినాష్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌న కుమారుడిని టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా నిల‌బెట్టి గెలిపించుకోవాల‌ని నెహ్రూ ఎన్నో క‌ల‌లు క‌న్నారు. కానీ అవి తీర‌కుండానే ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అవినాష్‌కు పొలిటిక‌ల్‌గా ఎలాంటి ప్ర‌యారిటీ ఇస్తారో చూడాలి.

Continue Reading
English Summary:Five-time MLA from kankipadu win the Nehru was also a minister in the cabinet of the bullet. When the crisis has also led to NTR TDP Nehru.He joined the Congress after the death of the bullet.

MLA from Congress in 2004 to win the Nehru in 2009, but was defeated in the 2014 election.As the division of the state and the two fell to minus Effect Congress.

However, after a very long gap Nehru along with his son arrived TDP own niche.Avinasku ticket in the next elections, which by itself is already at Ys. If this is a place somewhere in the delimitation of constituencies in the district avinasku Naidu is seeking to have the seat of the MLA.Avinash occurred even if the delimitation of constituencies where the line is PENAMALURU seat.

TDP TDP candidate in the past as well as the electoral stronghold of the GUDIVADA Avinash name also was formed.TDP MLA on behalf of his son, however, stand in the next elections, a number of gelipincukovalani Nehru dreamed of. But they were tirakundane his sudden death.In this context, should give priority to the political avinasku Naidu. .

Devineni Avinash,devineni Nehru Died,Gudivada Constituency,political Priorities,tdp

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    NTR Next Movie on his Political Career

    By

    ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే...

  • News

    TDP Alliance with Congress in Telangana

    By

    తెలుగు రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల ఘ‌న‌మైన చ‌రిత్ర టీడీపీది. జాతీయ పార్టీ కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన టీడీపీ అలాంటి కాంగ్రెస్...

  • News

    TDP MLA Eyes on MP Seat

    By

    ఏపీలో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే త‌న ప‌ద‌విలో సంతృప్తిగా ఉండ‌లేక‌పోతున్నారా...

  • Devotional

    Lord Hanuman stills exist on Earth – Proofs

    By

    పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ...

To Top