దంత సమస్యలు రాకుండా ఉండాలంటే...చిన్న చిన్న చిట్కాలు

ఒకప్పుడు దంత సమస్యలు అనేవి ఎక్కువగా పెద్దవారిలోనే కన్పించేవి.కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ కనపడుతున్నాయి.

 Dental Problems And Solutions-TeluguStop.com

ముఖ్యంగా ఈ సమస్య టీనేజర్స్ లో కనపడుతుంది.అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్య నుండి సమర్ధవంతంగా బయట పడవచ్చు.

ప్రతి రోజు మూడు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి.బ్రష్ ని నేరుగా చిగుళ్లపై పెట్టి బ్రషింగ్ చేయకూడదు.

ఈ విధంగా చేస్తే రక్త స్రావం అయ్యే అవకాశం ఉంది.చిగుళ్ల మీద ఒత్తిడి పడకుండా సున్నితంగా బ్రష్ చేయాలి.

చాలా మంది దంతాలు అందంగా కనపడాలని తీగలను వేయించుకుంటారు.తీగలను వేయించుకున్న వారు ఆహారం తీసుకున్న ప్రతి సారి పళ్ళను శుభ్రం చేసుకోవటం తప్పనిసరి.

ఈ విధంగా శుభ్రం చేసుకోకపోతే దంత క్షయం ఏర్పడే అవకాశం ఉంది.

నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి.

పాలు,యాపిల్, పుచ్చకాయ వంటి ఆహారాలు దంత ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.

బ్రష్ చేసుకొనే విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

నోటి పరిమాణాన్ని బట్టి బ్రష్ ని ఎంపిక చేసుకోవటం ముఖ్యం.ఒకవేళ బ్రష్ పెద్దది అయితే చివరి దంతాలను శుభ్రం చేయటం కష్టం.

ఈ జాగ్రత్తలను పాటిస్తే దంత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube