కేసీఆర్ కి భారతరత్న కోసం డిమాండ్..

తెలుగునాట ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చంద్రబాబు ఎప్పటి నుంచో మొదలుపెట్టారు.ఆ దిశగా అనేకసార్లు కేంద్రానికి నివేదించారు.

 Demanding For Kcr’s Bharat Ratna-TeluguStop.com

మహానాడు జరిగిన ప్రతీసారి పార్టీలో ఇదే విషయంపై తీర్మానం కూడా చేస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక మొదటిసారిగా తెలంగాణా నుంచీ కూడా భారతరత్న డిమాండ్ ఒకటి వస్తోంది.

అది ఎన్టీఆర్ కోసం కాదు.తెలంగాణా రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న కేసీఆర్ కోసం.

మీరు విన్నది నిజమే.ఈ కొత్త డిమాండ్ ఎవరి కోసమో కాదు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం.

అసలు ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుకువచ్చేది నందమూరి ఎన్టీఆర్ పేరు.తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశాన్ని స్థాపించి.కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలో.కాంగ్రెస్ కి వెన్నులో వణుకు పుట్టించి తెలుగునాట తెలుగువాడి జెండా ఎగరేసి.

కాంగ్రెస్ ని మట్టి కరిపించిన మహా నాయకుడు.అంతకంటే ముందుగా.

ఎన్నో వైవిధ్యభరిత సినిమాలు చేసి.తెలుగు సినిమాని చిరస్థాయిగా ప్రపంచం ముందు నిలబెట్టి…తనకు తానే సాటి అని నిరుపించుకున్న గొప్ప నటుడు.

పేదలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన తెలుగు మనిషి ఎన్టీఆర్.అందుకే ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని.

అది కోట్లాదిమంది తెలుగు ప్రజల కోరిక అని కేంద్రం మీద ఎప్పటినుంచో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తున్నారు.

కేసీఆర్ కి కూడా భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

రాష్ట్రాన్ని శాంతియుత మార్గం వైపు తీసుకెళ్తున్న కేసీఆర్‌ను ఈ నెల 25న రవీంద్రభారతిలో సత్కరించి ‘శాంతిదూత’ బిరుదు ఇవ్వనున్నట్లు ఐకాస నాయకులు తెలిపారు.తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మత ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెలకొందనిఅందుకే కేసీఆర్ కి శాంతిదూత బిరుదు ఇస్తున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు.

తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కి భారతరత్న ఇవ్వడం సమంజసం అని.కేసీఆర్ అందుకు అర్హుడు అని వారి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube