‘నాన్నకు.. ’ రిలీజ్‌ అనుమానాలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు రెండు మూడు రోజుల ముందు వరకు గట్టిగా ప్రకటిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.అయితే తాజాగా పరిస్థితులను గమనిస్తే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం వాయిదా పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 Delay In Nannaku Prematho Release.?-TeluguStop.com

ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే.ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో స్వయంగా ఎన్టీఆర్‌ లేదా దర్శకుడు సుకుమార్‌లలో ఒకరు సినిమా విడుదలపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంతా భావించారు.

కాని అలా జరగలేదు.

ఎన్టీఆర్‌ లేదా సుకుమార్‌లు చిత్ర విడుదలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కనీసం చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఏ ఒక్కరు సైతం సినిమా విడుదల సంక్రాంతికి ఉంటుంది అనే ప్రకటన చేయలేదు.అసలు ఆడియో ఫంక్షన్‌లో సంక్రాంతి పదం రాలేదు.

దాంతో సినీ విశ్లేషకులు మరియు సినీ వర్గాల వారు ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవ్వడం అనుమానమే అంటున్నారు.దానికి తోడు ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉంది అని చిత్ర యూనిట్‌ సభ్యులే స్వయంగా చెబుతున్నారు.

షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్‌ సిద్దంగా లేడు అని, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో పాటు, సంక్రాంతికి బాబాయి బాలయ్య సినిమా ఉండటం వల్ల ఎన్టీఆర్‌ కాస్త తగ్గి ఉంటాడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube