దేశానికి మంత్రి - స్టార్ హీరోపై రౌడియిజం

డిఫెన్స్‌ మినిస్టర్ ఆఫ్ ఇండియా.దేశ పౌరులను రక్షించాల్సిన బాధ్యత ఇతనిపైనే ఉంది.

 Defence Minister Manohar Parrikar Admits That Bjp Tried To Pull Down Aamir Khan-TeluguStop.com

కాని మనోహర్ పర్రికర్ ఏం చేసారు? వింటే ఆశ్చర్యం కలగక మానదు.బాలివుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ పై బిజేపి పార్టి పగబట్టినట్లు ఒప్పేసుకున్నారు.

గత ఏడాది భారతదేశంలో “అసహనం పెరిగిపోతోంది, నా భార్య దేశాన్ని విడిచి వెళదామా అని అడగటం చాలా బాధాకరం” అంటూ అమీర్ ఖాన్ సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ వాఖ్యల మీద దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది.

ఆ వాఖ్యల తరువాత ఆమీర్ సెక్యూరిటీ తగ్గించటం, ఆమీర్ ప్రచారకర్తగా పనిచేస్తున్న కంపెనీలు తనతో కాంట్రాక్టులు రద్దు చేసుకోవటం, “ఇంక్రడబుల్ ఇండియా” నుంచి ఆమీర్ ని ప్రభుత్వం తొలగించటం జరిగాయి.అప్పటికే వీటి వెనుక కొందరు బిజేపి నాయకుల హస్తం ఉందని వార్తలొచ్చాయి.

తాజాగా ఒక ప్రైవేటు ఫంక్షన్ లో దేశ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రికర్ మాట్లాడుతూ (అనువాదం), “నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడితే, వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పాలి.ఎప్పడైతే తను (ఆమీర్) అలా అన్నాడో, అప్పుడు తను ఒక ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

మాలో కొంతమంది (బిజేపి నాయకులు) చాలా తెలివితేటలు కలవారు.ఒక టీమ్ దీనిమీద పనిచేస్తూ, ఆ కంపెనీకి ఆర్డర్స్ చేసి, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని ప్రచారం చేసింది,ఆ కంపెనీకి బుద్ధి రావాలని” అంటూ సంచలన వాఖ్యలు చేసారు.

కేంద్రమంత్రి కామెంట్స్ పై ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద దుమారమే రేగుతోంది.తన అభిప్రాయం చెబుతూ, తన భార్య ఇలా తప్పుగా మాట్లాడింది అని చెప్పింనందుకు ఆమీర్ పై ఒక మంత్రి ఇలా రౌడియిజం చేయడం ఎంతవరకు కరెక్టు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube