సూపర్ స్టార్ మహేష్ పేరుకి తెలుగు హీరో అయినా, దేశవ్యాప్తంగా మహేష్ కి ఉన్న పాపులారిటి అంతా ఇంతా కాదు.మహేష్ ఇంటర్వ్యూ కోసం నేషనల్ మీడియా ఎగబడుతూ ఉంటుంది.
మహేష్ కూడా ఎక్కువగా జాతియ మీడియాతోనే మాట్లాడుతూ ఉంటాడు.అదే పద్ధతిలో మహేష్ ఒక జాతయ వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
అందులో ఇష్టమైన కథానాయిక ఎవరు అనే ప్రశ్నకు బదులిస్తూ, నాకు ఒకప్పుడు శ్రీదేవి అంటే చాలా ఇష్టం అని, ఇప్పుడు దీపిక పడుకోన్ అంటే ఇష్టమని అని చెప్పాడు సూపర్ స్టార్.అప్పటికప్పుడు ఆ ఇంటర్వ్యూ చదివిన దీపిక మహేష్ కి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా థ్యాంక్స్ చెప్పింది.
అర్థరాత్రి ఈ థ్యాంక్స్ చెప్పడమేంటి అని మొదట అంతా ఆశ్చర్యపోయినా, దానికి కాస్త ముందుగా వచ్చిన ఇంటర్వ్యూ చుసాకా మ్యాటర్ అర్థం అయ్యింది.
నాకు మహేష్ అంటే చాలా ఇష్టం దీపికా ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు.టాలివుడ్ మహారాజు, బాలివుడ్ మహారాణి తో జత కలిస్తే ఎవరికి మాత్రం చూడాలని ఉండదు.