మళ్ళి రామ్ చరణ్ ని టార్గేట్ చేసిన దాసరి

ఏ ముహూర్తాన మొదలైందో కాని ఓ పట్టానా తెగట్లేదు దాసరి, చరణ్ ల గొడవ.మగధీర చిత్రానికి గాను రామ్ చరణ్ కి రావాల్సిన నంది అవార్డు దాసరికి వెళ్లిందని, దీని వెనక దాసరి హస్తం ఉందని అప్పట్లో రాద్ధాంతం జరిగిన విషయం తెలిసిందే.

 Dasari Targets Ram Charan Again-TeluguStop.com

అక్కడినుంచి మొదలు ఏమాత్రం అవకాశం దొరికినా ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం అయిపొయింది.

రుద్రమదేవి విడుదలైన నేపథ్యంలో రామ్ చరణ్ తన బ్రూస్ లీ ను వాయిదా వేసుకొని గుణశేఖర్ కి సహాయపడాలనే వాదన తెరపైకి వచ్చింది.

దీని మీద స్పందిస్తూ తమకు ఎవరు ఫోన్ చేయలేదని, తాము ముందే అనౌన్స్ చేసామని, రుద్రమదేవి అనుకోకుండా మీద వచ్చి పడితే చేసేదేమీ లేదని రామ్ చరణ్ బ్రూస్ లీ విడుదల తేదిని ఈ నెల 16గా ఖరారు చేసిన సంగతి తెల్సిందే.

ఈ వేడిలో ఇప్పుడు దాసరి నారాయణ రావు కలిపించుకొని అగ్నికి ఆజ్యం పోసారు.

మీడియాతో మాట్లాడుతూ ” అక్టోబర్ 16న రావాల్సిన సినిమా వాయిదా వేసుకుంటే, రుద్రమదేవి చరిత్ర సృష్టిస్తుంది ” అని చరణ్ వైఖరిపై బాణం సంధించారు.ఇప్పుడు రామ్ చరణ్ కౌంటర్ ఎలా ఉండబోతోందో, మళ్ళి వీరిద్దరి గొడవ ఎందాక వెళ్తుందో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube