గుంటూరు కారం కూడా ప్రమాదకరమైపోయంది

కడుపుకి అన్నం తింటున్నామో, కెమికల్స్ తింటున్నామో అర్థం కావడం కష్టమైపోయింది.ఇన్నిరోజులు బియ్యంలో కెమికల్స్ వాడుతున్నారని విన్నాం, ఫలాల్లో కూడా కెమికల్స్ వాడుతున్నామని విన్నాం.

 Dangerous Pesticides In Guntur Chilli Powder – Study-TeluguStop.com

కాని నమ్మడానికి వీలుగా లేని విషయం ఏమిటంటే, మిరపకాయల్లో కూడా పెస్టిసెడ్స్ కలుపుతున్నారట.అది కూడా ఫేమస్ గుంటూరు కారంలో!

కేరళలోని Pesticide Residue Research and Analytical Lab లో 51 శాంపిల్స్ కలెక్ట్ చేసి పరిశోధన చేశారు.

అందులో పేరుమోసిన కారం బ్రాండ్స్ ఉన్నాయి.దారుణమైన విషయం ఏమిటంటే, గుంటూరు నుంచి వచ్చే కారం కూడా స్వచ్ఛమైనది కాదు.

అందులోనూ పెస్టిసైడ్స్ కలుపుతున్నారు.

Ethion, Bifenthrin, Cypermethrin, Malathion, Chlorpyriphos లాంటి ప్రమాదకరమైన పెస్టిసెడ్స్ 21 శాంపిల్స్ లో కనిపించాయట.

కర్ణాటక, గుంటూరు నుంచి వచ్చే మిరపకాయలతో ఈ కారంని ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు.వాణిజ్యం కోసం కంపెనీలే కాదు, పంట పండిస్తున్నవారు కూడా కెమికల్స్ ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు పరిశోధకులు.

పేర్లు బయటపెట్టలేదు కాని, ఆ 21 శాంపిల్స్ లో మనం వాడే టాప్ బ్రాండ్స్ కూడా ఉన్నాయట.కాబట్టి, వీలైనంతవరకు, బ్రాండ్ వాల్యూ కాకుండా రైతులని నమ్ముకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube