ఒక తెలుగు చిత్రం ఆమీర్ ఖాన్ ఓపెనింగ్స్ ను కొట్టడం ఏమిటి, షారుఖ్ సినిమాలన్నిటిని దాటడం ఏమిటి .ఎవరు ఊహించకుండానే బాహుబలి మొదటి భాగం అంత చేస్తే .
భారి అంచనాల నడుమ విడుదలయ్యే బాహుబలి రెండో భాగం ఇంకెంత చేయాలి ? సమయం అలాంటిది .ఇప్పుడు ఏకంగా ఆమీర్ ఖాన్ తో ఆమీతుమీ కి సిద్ధం అనేలా ఉన్నాడు బాహుబలి.
తాజా వార్త ఏంటంటే .బాహుబలి రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల అవుతుందట.అయితే ఏమవుతుంది అనుకుంటున్నారా .ప్రతి ఏడాది చివర్లో వచ్చి తన రికార్డులని తనే ఎగరేసుకుపోయేదెవరు .ఆమీర్ ఖానేగా .డిసెంబర్ లో వచ్చి కొత్త రికార్డు కొట్టి , మళ్ళి వచ్చే సంవత్సరం డిసెంబర్ లో వచ్చి , తను క్రియేట్ చేసిన రికార్డుని తానె కొట్టే ఆమీర్ ఖాన్ పప్పులు వచ్చే ఏడాది ఉడకకపోవచ్చు.దంగల్ తో పాటు బాహుబలి రెండో భాగం కుడా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అవుతాయి.
నిజంగానే రెండు సినిమాలు పోటిగా దిగితే నష్టం ఎవరికీ ? ఆమీర్ ఖాన్ ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి బాహుబలి కి ఓవర్సీస్ కష్టాలు ఉంటాయి.ఇక దక్షిణాది లో ఆమీర్ ఖాన్ తీవ్రంగా దెబ్బతినక తప్పదు.మనం మాత్రం ఏం నిర్ణయించుకోగలం ఒకేసారి రెండు పెద్ద సినిమాలు వస్తే .అంతా సవ్యంగా జరిగి కాస్త గ్యాప్ లోనే రెండు సినిమాలు వస్తే సరి.