రేప్ చేయబోయాడు .. కత్తితో "అక్కడ" దాడి చేసింది

వయసు కేవలం 17.ఇంకా మేజర్ కూడా కాలేదు ఆ అమ్మాయి.

 Dalit Girl Chops Genitals Of A Rapist-TeluguStop.com

కాని చాలామంది చేయని సాహసమే చేసింది.కత్తితో బెదిరించి మానభంగం చేసినట్టి వార్తలు ఎన్నో చూస్తున్నాం.

కాని ఎన్నడు లేని విధంగా అదే కత్తితో తనకన్న వయసులో చాలా పెద్దగా, బలంగా ఉన్న ఓ మగవాడిపై ఎదురుదాడి చేసింది ఓ టీనేజర్.అమ్మాయిల్లో స్ఫూర్తి నింపే ఈ సంఘటన మీరట్ లో జరిగింది.

23 ఏళ్ళ రయీస్ ఒక టీనేజర్ బాలికను కత్తితో బెదిరించి రేప్ చేస్తానని బెదిరించాడు.లొంగకపోతే చంపేస్తా అని భయపెట్టాడు.

ఆ అమ్మాయి బెదిరిపోలేదు.పారిపోడానికి ప్రయత్నించలేదు.

అతడి చేతిలోంచి కత్తి లాక్కుంది.అతడి “ప్రైవేటు బాడి పార్ట్స్” మీద దాడి చేసింది.

నొప్పి తట్టుకోలేక, రక్తపు మడుగులో అతను పెట్టిన కేకలు, ఏడుపులు గ్రామస్తులకు వినిపించాయి.వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.

అమ్మాయి స్టెట్‌మెంట్ ని రికార్డు చేసుకున్న పోలీసులు అతడిపై కేసు బుక్ చేసారు.రయీస్ ముస్లీం కావడంతో, అమ్మాయి హిందువుల్లో ఓ బలహీన వర్గానికి చెందినది కావడంతో, ఎటువంటి గొడవలు జరగకుండా సెక్యూరిటీ టైట్ చేసారు.

ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న ఆ యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube