మీరు విన్నది నిజమే, విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేసింది ఈ హీరోయిన్

ప్రస్తుతం టాలివుడ్ ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ గురించిన ముచ్చట్లే.ఏ కాలేజిలో చూసిన విజయ్ ఆటిట్యూడ్ గురించి మాట్లాడే కుర్రాళ్ళే, విజయ్ అందానికి, బాడికి ఫిదా అయిపోయిన అమ్మాయిలే.

 Crazy Heroine Rejects Vijay Devarakonda Film-TeluguStop.com

ఇక సినీ విమర్శకుల దగ్గరికి వెళితే, విజయ్ నటనాపటిమ గురించి పొగడ్తలే‌.పెళ్ళిచూపులు ఈ స్టార్ డమ్ కి బీజం వేస్తే, అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది.

విజయ్ తో సినిమా అంటే ఇప్పుడు హీరోయిన్లు ఒక్కనిమిషం కూడా ఆలోచించకుండా ఓకే అనేస్తారు, అలాంటిది ఓ క్రేజి హీరోయిన్ మాత్రం కాదని వెళ్ళిపోయింది.

గీత ఆర్ట్స్, యూవి క్రియేషన్స్ నిర్మాణంలో విజయ్ ఓ సినిమా ఒప్పుకున్నాడు.

ఈ డీల్ అర్జున్ రెడ్డి విడుదలకి ముందే జరిగింది.ఈ సినిమాకి దర్శకుడు పరశురామ్.

ఆ సమయానికి లావణ్య త్రిపాఠితో రెండు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నారు గీతా అర్ట్స్ వారు.అందులో ఒకటి అల్లు శిరీష్ హీరోగా, పరశురామ్ దర్శకత్వంలోనే వచ్చిన శ్రీరస్తు శుభమస్తు.

ఇక విజయ్ – పరశురామ్ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని ఫిక్స్ చేసుకున్నారు.

మరి ఇప్పుడు ఆ స్థానంలోకి కన్నడ ముద్దుగుమ్మ రష్మిక్ వచ్చిందిగా? అదే కదా, లావణ్య ప్రాజెక్టు లోంచి తప్పుకోవడం వల్లనే ఈ కొత్త అమ్మాయి వచ్చింది‌.అందుకు కారణం రెమ్యునరేషన్ గొడవలే అంట‌.ఎందుకంటే ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో లావణ్య మంచి ఫామ్ లో ఉంది‌.అందుకని శ్రీరస్తు శుభమస్తు సినిమాకి మంచి ఎమౌంట్ ఇచ్చారు.ఇప్పుడు లావణ్య చేతిలో హిట్స్ లేవుగా, అందుకని తక్కువ ఎమౌంట్ ఇస్తామన్నారట‌.

దాంతో తక్కువ పారితోషికానికి ఈ సినిమా చేయను అని ఓ క్రేజి ప్రాజెక్టుని వదిలేసుకుంది‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube