తొందరపడి మరణ శిక్ష వేయొద్దు

న్యాయస్థానాలు తొందరపడి దోషులకు మరణ శిక్ష వేయొద్దని, వారు న్యాయపరమైన పరిష్కారాలు వెదుక్కునేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది.మరణ శిక్షను ధ్రువీకరించినా దోషులకు జీవించే హక్కు ఉంటుందని తెలిపింది.

 Courts Cannot Give Death Sentence In Haste-TeluguStop.com

ఉత్తరప్రదేశ్‌లోని ఒక సెషన్స్ కోర్టు ఒక యువతికి, ఆమె ప్రియుడికి మరణశిక్ష విధించింది.వీరు చేసిన నేరమేమిటంటే…రెండువేల ఎనిమిదో సంవత్సరంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హత్య చేశారు.

హతుల్లో పది నెలల పసిపాప కూడా ఉంది.ఇది తీవ్రమైన నేరం కాబట్టి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.

అయితే దీన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది.ఇది తొందరపడి ఇచ్చిన తీర్పుగా అభిప్రాయపడింది.

సెషన్‌్స జడ్జి తీర్పు ఇచ్చిన తరువాత శిక్ష అమలుకు కేవలం ఆరు రోజులే సమయం ఇచ్చారని, దోషులు పైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు ౩౦ రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం పేర్కొంది.చాలా కోర్టులు తొందరపడి మరణశిక్షలు విధిస్తున్నాయని సుప్రీం అభిప్రాయపడింది.

నిజమే కోర్టులు తీర్పులు ఇవ్వడంలో తొందరపడకూడదు.కాని కేసులను దశాబ్దాలుగా సాగదీయడం కూడా సమంజసం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube