మహేష్ సూపర్ స్టార్ అయితే ఏంటి ? కోర్టుకి రావాల్సిందే అన్న జడ్జీలు

శ్రీమంతుడు విడుదలై రెండు సంవత్సరాలు కావొస్తొంది.ఆ సినిమా పోయి, బ్రహ్మోత్సవడం వచ్చి, ఇప్పుడు స్పైడర్ కూడా రాబోతోంది.

 Court Warns Mahesh Babu About His Attendance-TeluguStop.com

అయినా ఓ వివాదం మాత్రం ఇంకా ఈ సినిమాని వీడటం లేదు.అదే శ్రీమంతుడు స్టోరి వివాదం.

శరత్ చంద్ర అనే నవల రచయత శ్రీమంతుడు కథని తన దగ్గరి నుంచి కాపీ కొట్టారని ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అంటున్నాడు.మీడియా ముందుకి కూడా వచ్చిన ఈ రచయిత, పలుమార్లు కేసు వేస్తానని శ్రీమంతుడు యూనిట్ వారిని బెదిరించి, చివరకి మహేష్ బాబు, కొరటాల శివ, నిర్మాత నవీన్ మీద కేసు వేయనే వేసాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కేసుకి సంబంధించిన విచారణ జరిగింది.ఆ తరువాత విచారణ పొడిగించబడింది.

కాని ఏ ఒక్క విచారణకు కూడా మహేష్ బాబు హాజరుకాలేదు.ఎప్పుడూ తన లాయర్లనే పంపించాడు.

మహేష్ మీద కోర్టు సమన్లు విడుదల చేసింది.అది కూడా మహేష్ లాయర్లు హ్యాండిల్ చేసారు.

మహేష్ శ్రీమంతుడు సినిమాలో కేవలం నటుడు మాత్రమే, మహేష్ ఈ చిత్రకథను రాయలేదు, రైటింగ్ డిపార్టుమెంటులో పని కూడా చేయలేదు, మహేష్ లాంటి సూపర్ స్టార్ ని కేవలం పబ్లిసిటి కోసం కేసులోకి లాగారని వాదిస్తూ వచ్చారు లాయర్లు.

ఇన్నాళ్ళు ఓపిక పట్టిన జడ్జీలు ఈసారి సీరియస్ అయ్యారట.

తదుపరి విచారణకు రవాల్సింది కేవలం లాయర్లు మాత్రమే కాదు, మహేష్ వ్యక్తిగతంగా రావాలి, మహేష్ సూపర్ స్టార్ అయితే ఏంటి, న్యాయస్థానం ముందు ఇదంతా నడవదు అంటూ గట్టిగా జవాబిచ్చింది కోర్టు.మరి మన ప్రిన్స్ ఈసారైనా కోర్టుకి వెళతాడో లేదో చూడాలి.

మరిన్ని వార్తలోకి వెళితే, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మహేష్ బాబు – కొరటాల శివ కొత్తగా “భరత్ అనే నేను” అనే సినిమాను ప్రారంభించారు.ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి మొదలుకానుంది.

ఇక మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ షూటింగ్ చివరి దశలో ఉంది.దసరా కానుకగా ఈ ద్విభాష చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube