‘దృశ్యం’ ఆయన సొంతమే!

మలయాళంలో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం’.చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Court Dismissed The Drishyam Movie Case-TeluguStop.com

జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమాను ఇప్పటికే తెలుగులో రీమేక్‌ చేశారు.వెంకటేష్‌, మీనా జంటగా నటించిన తెలుగు ‘దృశ్యం’ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం కమల్‌ హాసన్‌, గౌతమి జంటగా ‘పాపనాశనం’ పేరుతో ‘దృశ్యం’ చిత్రం రీమేక్‌ అవుతోంది.అయితే ఈ సినిమా కథ నాది అంటూ సతీష్‌ పాల్‌ అనే రచయిత కోర్టుకు వెళ్లాడు.

తాను రాసిన ‘ఒరు మాకకలథు’ కథను ‘దృశ్యం’గా సినిమా చేశారు అంటూ సతీష్‌ పాల్‌ ఎర్నాకులం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది.సతీష్‌ పాల్‌ కేసును స్వీకరించిన ఎర్నాకులం కోర్టు గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల వాధనలు వినడం జరిగింది.

తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పును ఇచ్చింది.దర్శకుడు జీతూ జోసెఫ్‌ వాదనతో ఏకీభవించినట్లుగా కోర్టు ప్రకటించింది.

సినిమా కథకు ‘ఒరు మాకకలథు’ కథకు చాలా తేడా ఉందని కోర్టు విశ్వసించి ఈ కేసును కొట్టివేయడం జరిగింది.‘దృశ్యం’ కథ జీతూ జోసెఫ్‌దే అని కోర్టు తీర్పు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube