జ‌న‌సేన సీటు రేటెంతో తెలుసా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయంగా సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ ఎదురు చూస్తోన్న జ‌న‌సేన సైతం ప‌క్కా పొలిటిక‌ల్ పార్టీ ల‌క్ష‌ణాల‌తోనే ముందుకు వెళుతుందా ? జ‌నసేన సైతం మిగిలిన రాజ‌కీయ పార్టీల్లాగానే డ‌బ్బు రాజ‌కీయాలే చేసే ప్ర‌య‌త్నాల్లో ఉందా ? అంటు అవున‌నే ఆన్స‌ర్లే జ‌న‌సేన వ‌ర్గాల నుంచే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి రెడీ అవుతోన్న జ‌న‌సేన ఇంకా పూర్తిస్థాయిలో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌క‌పోయినా ఆ పార్టీ నుంచి పోటీ చేయాల‌నుకుంటోన్న ఔత్సాహికులు టిక్కెట్ల కోసం పార్టీ కార్యాల‌యంలో ప‌లువురిని సంప్ర‌దిస్తున్నారు.ఇంకాస్త పేరున్న వాళ్లు అయితే డైరెక్టుగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌నో లేదా ప‌వ‌న్ పీఏల‌ను క‌లిసి త‌మ మ‌న‌స్సులో మాట వెల్ల‌డిస్తున్నారు.

 Cost For Janasena Seat-TeluguStop.com

జ‌న‌సేన డ‌బ్బు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటుంద‌ని, ఇప్ప‌టికే ప‌లుపార్టీల్లో ఉన్న రాజ‌కీయ వార‌సుల‌ను, సీనియ‌ర్ల‌ను, ఇత‌ర పార్టీల్లో ఉన్న వారిని కాద‌ని కొత్త ర‌క్తాన్ని, యువ‌ర‌క్తాన్ని ఎంక‌రేజ్ చేస్తుంద‌ని, సామాన్యుల‌కే పార్టీ టిక్కెట్లు ఇస్తుంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌, జ‌న‌సేన వ‌ర్గాలు ప్ర‌క‌టిస్తూ వ‌చ్చాయి.

అయితే ప్ర‌స్తుతం పార్టీలో ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా, కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ జ‌న‌సేన‌లో జ‌రుగుతున్న‌ట్టు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

జ‌న‌సేన టిక్కెట్టు ఆశిస్తోన్న వారు త‌మ అప్లికేష‌న్‌ను పార్టీకి పెట్టుకుందామ‌ని వెళుతుంటే అక్క‌డ వారికి ఎదుర‌వుతోన్న ప్ర‌శ్న‌లు చూసి వారికి దిమ్మ‌తిరిగి పోతోంద‌ట‌.

మాకు ఓ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌తలు ఇస్తే అక్క‌డ‌కు వెళ్లి వ‌ర్క్ చేసుకోవ‌డంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామ‌ని వారు చెపుతుంటే మీరు ఎన్ని కోట్ల వ‌ర‌కు ఖర్చు చేస్తారు ? అలాగే పార్టీ కార్య‌క‌లాపాలు న‌డిపేందుకు ఎంతోకొంత ఇక్క‌డ ఫండింగ్ కూడా ఎరేంజ్ చేయాల‌ని చెపుతున్నార‌ట‌.దీంతో టిక్కెట్ల కోసం అప్లికేష‌న్లు పెట్టుకునేందుకు వెళ్లిన వారికి ఆ దెబ్బ‌తో నోట మాట కూడా రావ‌డం లేద‌ని స‌మాచారం.

ఆ దెబ్బ‌తో ఆశావాహులు త‌మ‌కు అంత స్థోమ‌త ఉంటే ప్ర‌ధాన పార్టీల నుంచే పోటీ చేస్తాం క‌దా ? అని తిరుగుట‌ఫా క‌డుతున్నార‌ట‌.గ‌తంలో ప‌వ‌న్ అన్న చిరు సైతం టిక్కెట్ల పంపిణీ డ్యూటీని త‌న బావ‌మరిది అల్లు అర‌వింద్ చేతుల్లో పెట్ట‌డంతో ఆయ‌న టిక్కెట్లు అమ్ముకున్నార‌న్న విమ‌ర్శ‌లు భారీగా వ‌చ్చాయి.

ఈ ప్ర‌భావం చిరుపై ప‌డి ప్ర‌జారాజ్యం అట్ట‌ర్‌ప్లాప్ అవ్వ‌డంతో పాటు చిరు ప‌రువు మొత్తం ఖ‌ల్లాస్ అయ్యింది.మ‌రి ఈ విష‌యంలో ప‌వ‌న్ ఇప్ప‌ట‌కీ అయినా మేలుకోక‌పోతే జ‌న‌సేన‌కు కూడా ప్రజారాజ్యంకు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌న్న విమ‌ర్శ‌లు అప్పుడే వ‌స్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube