కాంగ్రెసు ఏం చేసిందో చెప్పాలి?

కాంగ్రెసు తన పదేళ్ల పాలనలో రైతులకు ఏం చేసిందో చెప్పాలని భాజపా డిమాండ్‌ చేసింది.రెండు నెలల పాటు కనబడకుండాపోయి దేశానికి తిరిగి వచ్చిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన మొదటి కార్యక్రమంగా రైతు సమస్యలపై దృస్టి పెట్టారు.

 Congress Needs To Tell The Nation What It Has Done-TeluguStop.com

ఆదివారం రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.ఈ సభలో రాహుల్‌ ఏం చెబుతాడో తెలియదుగాని రైతులను ఆయన ఆకట్టుకుంటాడనే భయం భాజపాకు పట్టుకున్నట్లుంది.

అందుకే మీ పాలనలో రైతులకు ఏం చేశారో చెప్పండి అని కాంగ్రెసును నిలదీస్తోంది.కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ కాంగ్రెసుపై అనేక ప్రశ్నలు సంధించారు.

మీ పాలనలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? మీ పాలనలో నిరుద్యోగం ఎందుకు పెరిగింది? జవాబు చెప్పండి అంటూ నిలదీశారు.తాము తెచ్చిన భూసేకరణ బిల్లును విమర్శిచడాన్ని కాంగ్రెసుకు చెందిన ఓ ముఖ్యమంత్రే వ్యతిరేకించారని అన్నారు.

ఆయన ఎంత తిరిగినా ఆయన ప్రభావం ఏమీ లేదన్నారు.మీరేం చేశారంటే మీరేం చేశారని రాజకీయ నాయకులు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం రాజకీయ క్రీడలో ఓ భాగం.

రాహుల్‌ గాంధీ రైతులతో బహిరంగ సభ ఒక్కసారి నిర్వహించగానే ఆ పార్టీ ఏమీ బలపడిపోదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube