‘డైనమైట్‌’ పేలేదెప్పుడో?

మంచు విష్ణు హీరోగా, ప్రణీత హీరోయిన్‌గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైనమైట్‌’.ఇప్పటికే ఈ సినిమా ఆడియో విడుదలైంది.

 Confusion On Manchu Vishnu Dynamite Release-TeluguStop.com

సినిమా కూడా విడుదలకు సిద్దం అయ్యింది.‘బాహుబలి’ విడుదలకు వారం ముందు ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

అయితే ‘బాహుబలి’తో తలబడి నష్టం తెచ్చుకోవడం ఎందుకని భావించిన మంచు విష్ణు ఆ ప్రకటన తాను చేసింది కాదని, తమ సినిమాను ‘బాహుబలి’ విడుదల తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అంటూ ప్రకటించాడు.

మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ సినిమాను జులై 17 లేదా 24న విడుదల చేస్తాం అంటూ ప్రకటించాడు.

కాని ఆ రెండు వారాలు పోయాయి.మరో వారం కూడా దగ్గరకు వస్తుంది.అయినా కూడా ఇప్పటి వరకు ‘డైనమైట్‌’ విడుదల తేదీ ఫిక్స్‌ కాలేదు.‘డైనమైట్‌’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళంలో సక్సెస్‌ అయిన సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది.విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో సినిమాపై ఆసక్తి ఉంది.

ఈ సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube